NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 
    తదుపరి వార్తా కథనం
    Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 
    ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి

    Delhi Fire Accident: ఢిల్లీలోని అలీపూర్‌లోని పెయింట్‌ ఫ్యాక్టరీలో అగ్ని ప్రమాదం.. 11 మంది మృతి 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Feb 16, 2024
    08:33 am

    ఈ వార్తాకథనం ఏంటి

    దిల్లీలోని అలీపూర్‌లోని దయాల్‌పూర్ మార్కెట్‌లో గురువారం పెయింట్ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగడంతో 11 మంది సజీవ దహనం అయ్యారు.

    మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. ఢిల్లీ ఫైర్ సర్వీస్ (DFS) నుండి ఒక అధికారి మాట్లాడుతూ, ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం గురించి సాయంత్రం 5.30 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, 22 టెండర్లను సేవలో ఉంచామని తెలిపారు.

    అయితే, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి భారీ ఎత్తున మంటలు చెలరేగాయి..ఈ ఘటనలో ఇప్పటి వరకు 11 మంది మృతి చెందారని.. మృతదేహాలు పూర్తిగా కాలిపోవడంతో మృతులను గుర్తించడం కష్టంగా మారిందన్నారు.

    Details 

    గాయపడిన వారిలో ఫ్యాక్టరీ కార్మికులు 

    పేలుడు కారణంగా సమీపంలోని కొన్ని ఇళ్లు, దుకాణాలు కూడా అగ్నికి ఆహుతయ్యాయి.గాయపడిన వారిలో ఫ్యాక్టరీ కార్మికులు కూడా ఉన్నారు అని పోలీసులు తెలిపారు.

    పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అగ్నిప్రమాదానికి ముందు ఫ్యాక్టరీలో పేలుడు సంభవించింది.

    తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

    ఇటీవల, జనవరి 26న ఢిల్లీలోని షహదారా ప్రాంతంలో బహుళ అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఓ ఇంట్లో మంటలు చెలరేగడంతో తొమ్మిది నెలల చిన్నారి సహా నలుగురు వ్యక్తులు ఊపిరాడక మరణించగా, ఇద్దరు గాయపడ్డారు.

    అదేవిధంగా, జనవరి 18న వాయువ్య ఢిల్లీలోని పితంపురాలో బహుళ అంతస్తుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో నలుగురు మహిళలు సహా ఆరుగురు మరణించారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ
    అగ్నిప్రమాదం

    తాజా

    Venu : 'ఎల్లమ్మ' ప్రారంభానికి సర్వం సిద్ధం.. కన్‌ఫర్మ్‌ చేసిన దర్శకుడు వేణు టాలీవుడ్
    UK Professor: 'భారత వ్యతిరేక కార్యకలాపాల' కారణంగా విదేశీ పౌరసత్వాన్ని కోల్పోయా..  లండన్
    M R Srinivasan: ప్రముఖ అణు శాస్త్రవేత్త ఎం ఆర్ శ్రీనివాసన్ కన్నుమూత  శాస్త్రవేత్త
    BCCI: లక్నో బౌలర్‌ను సస్పెండ్ చేసిన బీసీసీఐ లక్నో సూపర్‌జెయింట్స్

    దిల్లీ

    Dense Fog: ఉత్తర భారతదేశాన్ని కమ్మేసిన పొగమంచు.. మరో 2 రోజులు ఇదే పరిస్థితి  ఉత్తర్‌ప్రదేశ్
    Cab driver stabbed: దిల్లీలో క్యాబ్ డ్రైవర్‌ హత్య.. ఓవర్‌టేక్ చేయడానికి దారిఇవ్వలేదని  భారతదేశం
    Blinkit's Condom order: వీడు మామూలోడు కాదు.. 2023లో ఏకంగా 10వేల కండోమ్‌లు వాడేశాడు జొమాటో
    Cm Kejriwal : కేజ్రీవాల్ సంచలన వ్యాఖ్యలు.. జైలుకు వెళ్లేందుకు రెడీగా ఉండాలని కార్యకర్తలకు సూచన  అరవింద్ కేజ్రీవాల్

    అగ్నిప్రమాదం

    సాహితీ ఫార్మాలో పేలిన రియాక్టర్‌.. ఏడుగురు కార్మికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు ఆంధ్రప్రదేశ్
    శాన్‌ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్‌కు నిప్పంటించిన దుండగులు కాలిఫోర్నియా
    చెన్నై: నడిరోడ్డుపై అగ్గిపాలైన ఖరీదైన బీఎండబ్ల్యూ కారు.. భారీగా ట్రాఫిక్ జామ్  చెన్నై
    Delhi AIIMS: దిల్లీ ఎయిమ్స్‌లో అగ్ని ప్రమాదం; రంగంలోకి అగ్నిమాపక సిబ్బంది దిల్లీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025