Page Loader
Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు
ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు

Bomb Threat: ఢిల్లీలోని ఓ పాఠశాలకు బాంబు బెదిరింపు.. స్కూల్ ప్రాంగణంలో తనిఖీలు

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 29, 2024
02:28 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని రోహిణి ప్రాంతంలోని ఒక ప్రైవేట్ పాఠశాలకు నవంబర్ 28 న బెదిరింపు సందేశం వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తులు ఉదయం 10:57 గంటలకు ఈ-మెయిల్ ద్వారా బెదిరింపులు పంపారు. ఈ విషయాన్ని గమనించిన స్కూల్ యాజమాన్యం వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చింది. ఆ వెంటనే, అగ్నిమాపక శాఖ అధికారులు, పోలీసులు పాఠశాల వద్దకు చేరుకుని విద్యార్థులు, సిబ్బందిని సురక్షితంగా బయటకు తరలించారు. తరువాత బాంబు స్వ్కాడ్‌,డాగ్‌ స్వ్కాడ్‌ సహాయంతో పాఠశాల మొత్తం తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి పేలుడు పదార్థాలు లేదా అనుమానాస్పద వస్తువులు లభ్యంకాలేదని అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.ఈ సంఘటన విద్యార్థుల తల్లిదండ్రుల్లో భయాందోళన కలిగించింది.

వివరాలు 

పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో బాంబు పేలుడు

అదేవిధంగా, గురువారం నాడు ఢిల్లీలోని ప్రశాంత్ విహార్ ప్రాంతంలో ఉన్న పీవీఆర్ మల్టీప్లెక్స్ సమీపంలో బాంబు పేలుడు చోటుచేసుకుంది. ఈ ఘటన స్థానికులను, మల్టీప్లెక్స్‌ను సందర్శించిన వారిని భయాందోళనకు గురిచేసింది. బాంబు పేలుడు పీవీఆర్ మల్టీప్లెక్స్‌కు కొద్ది దూరంలో జరిగినట్లు, ఒక ఆటో డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. ఘటన స్థలంలో తెల్లటి పౌడర్ లభ్యమైనట్లు పోలీసులు పేర్కొన్నారు. దర్యాప్తు కొనసాగుతుందని వారు తెలిపారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

ప్రైవేట్ పాఠశాలకు బాంబు బెదిరింపు