Page Loader
అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన
అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన

అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ లేఖ.. అత్యాచార బాధితురాలిని కలవనివ్వాలని అభ్యర్థన

వ్రాసిన వారు TEJAVYAS BESTHA
Aug 22, 2023
06:27 pm

ఈ వార్తాకథనం ఏంటి

కేంద్రహోం శాఖ మంత్రి అమిత్ షాకు దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మలివాల్ లేఖ రాశారు. స్త్రీ శిశుసంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ చేతిలో పలుమార్లు అత్యాచారానికి గురైన బాలికను కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు. ఇప్పటికే ఆస్పత్రి బయట బాధితురాలిని కలిసేందుకు అక్కడి పోలీసులు నిరాకరిస్తున్నారని అమిత్ షా దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు వెంటనే తనను బాధితురాలిని కలిసే ఏర్పాటు చేయాలని మలివాల్ కోరారు. గత రెండు రోజుల నుంచి ఆస్పత్రి ఆవరణలో స్వాతి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. అయినప్పటికీ పోలీసులు ఆమెను లోపలికి అనుమతించలేదు. నిందితుడ్ని అరెస్ట్ చేయడంలో దిల్లీ పోలీసుల జాప్యంపై తక్షణమే విచారణకు ఆదేశించాలని కోరారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

దిల్లీ మహిళా కమిషన్ చీఫ్ అమిత్ షాకు రాసిన లేఖ