స్నేహితుడి కూతురిపై అత్యాచారం చేసిన ప్రభుత్వ అధికారిపై సస్పెన్షన్ వేటు
ఈ వార్తాకథనం ఏంటి
స్నేహితుడి కూతురపై పలుమార్లు అత్యాచారం చేసిన కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న దిల్లీ ప్రభుత్వ అధికారి ప్రేమోదయ్ ఖాఖాను పోలీసులు సోమవారం అరెస్టు చేశారు.
అత్యాచారం వ్యవహరంలో సహకరించిన అతని భార్యను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ప్రేమోదయ్ ఖాఖాను అరెస్టు చేయడానికి ముందు దిల్లీ ప్రభుత్వం అతన్ని మహిళా, శిశు అభివృద్ధి శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ పదవి నుంచి తొలగిచింది. ఈ మేరకు సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసీంది.
దిల్లీలో లా అండ్ ఆర్డర్ కేంద్ర ప్రభుత్వం ఆధీనం ఉంది. ఈ క్రమంలో అత్యాచారం చేసిన అధికారిని అరెస్టు చేయడంలో కేంద్రం జాప్యం చేయడంపై దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నిలదీశారు. అనంతరం ఖాఖాను సస్పెండ్ చేయడమే కాకుండా, అరెస్టు కూడా చేశారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
భార్యాభర్తలను అరెస్టు చేసిన పోలీసులు
Suspended Delhi Officer, Accused Of Raping Friend's Teen Daughter, Arrested https://t.co/dlsRxGToEB@mukeshmukeshs reports pic.twitter.com/RwiPO0ukae
— NDTV (@ndtv) August 21, 2023