NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Air Pollution: దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం 
    తదుపరి వార్తా కథనం
    Air Pollution: దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం 
    దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం

    Air Pollution: దేశరాజధానిలో అత్యంత ప్రమాదకరంగా వాయు కాలుష్యం 

    వ్రాసిన వారు Sirish Praharaju
    Oct 14, 2024
    04:29 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం పెరిగిపోయింది. దీపావళి పండుగకు ముందే వాయు నాణ్యత క్షీణించింది.

    కాలుష్య నియంత్రణ మండలికి చెందిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ తక్కువగా ఉన్నట్లు వెల్లడించింది.

    సోమవారం ఉదయం 9 గంటల సమయానికి ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 221గా నమోదైనట్లు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ తెలిపింది.

    సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (Central Pollution Control Board)ప్రకారం..ఎన్‌సీఆర్‌లో ఘజియాబాద్ 265,నోయిడా 243, గ్రేటర్ నోయిడా 228 వంటి పలు ప్రాంతాల్లో గాలి నాణ్యత అధ్వానంగా ఉంది.

    గురుగ్రామ్‌లో 169,ఫరీదాబాద్‌లో 177గా గాలి నాణ్యత నమోదైంది.మరోవైపు, దేశ రాజధానిలో సోమవారం కనిష్ట ఉష్ణోగ్రత 18.6 డిగ్రీల సెల్సియస్‌గా, గరిష్ట ఉష్ణోగ్రత 35 డిగ్రీల సెల్సియస్‌గా నమోదయ్యే అవకాశముందని తెలిపారు.

    వివరాలు 

    ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరం

    ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్‌కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం,గాలి నాణ్యత 447కు పడిపోతే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు.

    ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉందని, కాలుష్యం లేదని అర్థం.

    AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్థంగా ఉందని, AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.

    ఈ క్రమంలో, ఇటీవల ఢిల్లీలో వాయు కాలుష్యం ఆందోళనకరంగా మారింది.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    దిల్లీ

    తాజా

    CSK vs RR : చైన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ విజయం రాజస్థాన్ రాయల్స్
    Andhra Pradesh: ఏపీలో వైద్య విప్లవానికి రంగం సిద్ధం.. బీమా ద్వారా ప్రతి కుటుంబానికి ఉచిత వైద్య సేవలు! ఆంధ్రప్రదేశ్
    Tata Harrier EV: జూన్ 3న హారియర్ EV ఆవిష్కరణ.. టాటా నుండి మరో ఎలక్ట్రిక్ మాస్టర్‌పీస్! టాటా మోటార్స్
    Turkey: టర్కీ,అజర్‌బైజాన్‌లకు షాక్ ఇస్తున్న భారతీయులు.. 42% తగ్గిన వీసా అప్లికేషన్స్..  టర్కీ

    దిల్లీ

    Medical student suicide: దిల్లీలో వైద్య విద్యార్థి ఆత్మహత్య  ఆత్మహత్య
    Amanatullah Khan: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ దాడులు.. అరెస్టు చేస్తారని పార్టీ ఆరోపణ ఇండియా
    Delhi: ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌ను అరెస్ట్ చేసిన ఈడీ  భారతదేశం
    Swati Maliwal assault case: స్వాతి మలివాల్‌ దాడి కేసు.. బిభవ్ కుమార్‌కు బెయిల్ భారతదేశం
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025