Page Loader
Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 
ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు

Air Pollution: ఢిల్లీలో తీవ్రంగానే గాలి కాలుష్యం ..నగరాన్నికమ్మేసిన దట్టమైన పొగలు 

వ్రాసిన వారు Sirish Praharaju
Nov 11, 2024
12:12 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) తీవ్రంగా కొనసాగుతోంది. గత పది రోజుల నుంచి రాజధాని ప్రాంతంలో కాలుష్యం అత్యంత తీవ్రమైన స్థాయిలో ఉంది. సోమవారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచి అధ్వానంగా నమోదైంది. అలాగే నగరాన్ని పొగమంచు పూర్తిగా ఆవహించింది. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రకారం, ఉదయం 9 గంటలకు ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (Air Quality Index) 349గా నమోదైంది. రాజధానిలోని కొన్ని ప్రాంతాల్లో గాలి నాణ్యత సూచి 400 (తీవ్రమైన స్థాయి)కి పైనే నమోదైంది.

వివరాలు 

మోడరేట్‌ కేటగిరీలో ముంబై

బవానాలో ఏక్యూఐ 401, జహంగీర్‌పురిలో 412, ఆనంద్‌ విహార్‌లో 378, అశోక్‌ విహార్‌లో 379, ద్వారకా సెక్టార్‌ 8లో 356, ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ ప్రాంతంలో 336, ముంద్కా ప్రాంతంలో 379, ద్వారకాలో 379, పంజాబీ బాగ్‌లో 385, ఆర్కే పురంలో 368, రోహిణిలో 383, వజీర్‌పూర్‌లో 391గా ఏక్యూఐ లెవల్స్‌ నమోదయ్యాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో గాలి నాణ్యత సూచీ 140తో మోడరేట్‌ కేటగిరీలో నమోదైంది. ముంబై నగరాన్ని కూడా పొగ మంచు కమ్మేసింది.

వివరాలు 

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు

అయితే, సోమవారం తెల్లవారుజామున ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రత 17.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైనట్లు భారత వాతావరణ శాఖ (IMD) తెలిపింది. దీంతో ఢిల్లీ నగరాన్ని తేలికపాటి పొగమంచు కమ్మేసింది. సోమవారం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. మరోవైపు కాలుష్య నియంత్రణకు ఢిల్లీ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ క్రమంలో ఆప్‌ ప్రభుత్వం ఆదివారం 'EV as a Service‌' కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఎలక్ట్రిక్ వాహనాలను పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయాలుగా ప్రోత్సహిస్తోంది.