Page Loader
Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..
ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

Building Collapse: ఢిల్లీలోని ముస్తఫాబాద్ ఏరియాలో కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..

వ్రాసిన వారు Sirish Praharaju
Apr 19, 2025
08:03 am

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలోని ముస్తఫాబాద్ ప్రాంతంలో శుక్రవారం రాత్రి తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అక్కడ ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు నలుగురు వ్యక్తులు మృతి చెందగా, మరికొందరు శిథిలాల కింద చిక్కుకుపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ పోలీసులు, జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను వేగవంతంగా ప్రారంభించారు. భవనం కూలే సమయంలో అక్కడ నిర్మాణ పనులు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.

వివరాలు 

సహాయక చర్యలు చేపట్టిన ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు

ఈ ఘటనపై అదనపు పోలీస్ కమిషనర్ వినీత్ కుమార్ స్పందిస్తూ, శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగిందని, నలుగురు చనిపోయారని, ఇద్దరు గాయపడినట్లు తెలిపారు. ఇక, డివిజనల్ ఫైర్ ఆఫీసర్ రాజేంద్ర అత్వాల్ మాట్లాడుతూ, తెల్లవారుజామున 2.50 గంటల సమయంలో భవనం కూలిపోయిందన్న సమాచారం తమకు వచ్చిందని చెప్పారు. వెంటనే ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఢిల్లీ ఫైర్ సర్వీసెస్ బృందాలు కలిసి సహాయక చర్యలు చేపట్టాయని వివరించారు. కూలిన భవనంలో ప్రమాద సమయంలో నలుగురు మహిళలు ఉండారని గుర్తించారు. వారిలో ఒకరికి ముగ్గురు పిల్లలు, మరో మహిళకు ఇద్దరు లేదా ముగ్గురు పిల్లలు ఉన్నట్టు సమాచారం. అయితే, ప్రస్తుతం వీరెవ్వరూ కనిపించకపోవడం ఆందోళన కలిగిస్తోంది. అధికారులు శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం గాలింపు కొనసాగిస్తున్నారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

కుప్ప కూలిన భవనం.. నలుగురు మృతి..