LOADING...
Tourism: యుద్ధ భయం.. లద్దాఖ్‌, మనాలీకి పెరిగిన డిమాండ్
యుద్ధ భయం.. లద్దాఖ్‌, మనాలీకి పెరిగిన డిమాండ్

Tourism: యుద్ధ భయం.. లద్దాఖ్‌, మనాలీకి పెరిగిన డిమాండ్

వ్రాసిన వారు Sirish Praharaju
Mar 26, 2026
12:19 pm

ఈ వార్తాకథనం ఏంటి

పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం గల్ఫ్‌ దేశాల పర్యటక రంగంపై స్పష్టంగా కనిపిస్తోంది. యుద్ధ వాతావరణం కారణంగా అక్కడికి వెళ్లేందుకు పర్యటకులు వెనుకడుగు వేస్తున్నారు. భద్రతపై ఆందోళనలు పెరగడంతో ట్రావెలర్స్‌ తమ ప్లాన్‌లను మార్చుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో భారతీయులు కూడా ముందుగా ప్లాన్‌ చేసుకున్న వేసవి విదేశీ ట్రిప్‌లను రద్దు చేసుకుంటున్నారు. గల్ఫ్‌ దేశాలపై ఆసక్తి తగ్గడంతో దేశీయ టూరిస్టు ప్రదేశాలపై దృష్టి పెరిగింది. దీని వల్ల ఇండియాలోని పర్యాటక రంగానికి ఊతం లభిస్తోంది.

వివరాలు 

దేశీయ టూరిజం వైపు మళ్లిన పర్యటకులు

వేసవి సెలవుల్లో అమెరికా, ఐరోపా దేశాలకు వెళ్లాలని ప్లాన్‌ చేసుకున్న వారు కూడా ఇప్పుడు ఆలోచన మార్చుకుంటున్నారు. పశ్చిమాసియాలో ఉన్న యుద్ధ పరిస్థితులు వారిని ప్రభావితం చేయడంతో, దేశంలోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను ఎంచుకుంటున్నారు. ప్రత్యేకంగా లద్దాఖ్‌, రిషికేశ్‌, శిమ్లా, మనాలీ, షిల్లాంగ్‌ వంటి చల్లని ప్రదేశాలకు మంచి డిమాండ్‌ పెరిగింది. వేడి నుంచి ఉపశమనం కోసం ఈ హిల్‌ స్టేషన్లను ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం దాదాపు 65 శాతం మంది పర్యటకులు ఈసారి దేశీయ టూర్లకే ప్రాధాన్యం ఇస్తున్నారు.

వివరాలు 

హిల్‌ స్టేషన్లు, ఆధ్యాత్మిక యాత్రలకు భారీ డిమాండ్

హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, లద్దాఖ్‌ ప్రాంతాలకు బుకింగ్‌లు గతంతో పోలిస్తే సుమారు 30 శాతం పెరిగాయి. ఇది స్వదేశీ టూరిజం పెరుగుతున్నదానికి స్పష్టమైన సంకేతం. అదే సమయంలో ఆధ్యాత్మిక పర్యటనలపై కూడా ఆసక్తి పెరుగుతోంది. సుమారు 23 శాతం మంది భక్తి యాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది ట్రావెల్ ట్రెండ్‌లో మార్పును చూపిస్తోంది.

Advertisement

వివరాలు 

విదేశీ ట్రిప్‌లకు కొత్త ఎంపికలు

ఇక విదేశాలకు వెళ్లాలనుకునే వారు గల్ఫ్‌ దేశాల బదులు సురక్షితంగా భావించే ఇతర దేశాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా వియత్నాం, నేపాల్‌, శ్రీలంక‌, ఇండోనేసియా, సింగపూర్‌, థాయ్‌లాండ్‌లకు డిమాండ్‌ పెరుగుతున్నట్లు ట్రావెల్‌ ఏజెన్సీల గణాంకాలు చెబుతున్నాయి.

Advertisement