Nitish Kumar: నితీష్‌కు భారతరత్న ఇవ్వాలని డిమాండ్.. వేడెక్కిన బీహర్ రాజకీయాలు
బీహార్ ముఖ్యమంత్రి, జేడీయూ అధినేత నితీష్ కుమార్‌కి భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ బీహార్ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం జేడీయూ కీలక భాగస్వామిగా ఉన్న కేంద్ర ప్రభుత్వంలో నితీష్‌కి ఈ గౌరవం లభిస్తే, అది బీహార్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఓ కీలక ఎత్తుగడ అవుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. పాట్నా నగరంలో జేడీయూ కార్యకర్తలు పోస్టర్ల ద్వారా నితీష్‌కి భారతరత్న ఇవ్వాలని కోరుతూ ప్రచారం ప్రారంభించారు. నితీష్ కుమార్ రాజకీయ జీవితంలో రాష్ట్రానికి చేసిన సేవలు, కేంద్రమంత్రి హోదాలో అందించిన సహకారాన్ని గుర్తుచేస్తూ, ఆయన భారతరత్నకు అర్హుడని స్పష్టం చేశారు.
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన నితీష్ కుమార్
జేడీయూ నాయకుల ప్రకారం నితీష్ కుమార్‌కి ఈ గౌరవం లభిస్తే, అది ఎన్డీఏ కూటమికి రాబోయే ఎన్నికల్లో కీలకంగా మారుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే సమయంలో ఆర్జేడీ, బీజేపీపై విమర్శలు గుప్పిస్తూ, నితీష్‌కి భారతరత్న ప్రతిపాదనను ఎన్నికల వ్యూహంగా విమర్శిస్తోంది. ఇక జేడీయూ పోస్టర్లపై ఆర్జేడీ తీవ్ర విమర్శలను గుప్పించింది. సీఎం కుర్చీని ఖాళీ చేయాలంటూ నితీష్‌పై బీజేపీ ఒత్తిడి తెస్తోందని ఆరోపించారు.