Bhatti Vikramarkha : ప్రజాభవన్‌లో కుటుంబసమేతంగా ఉపముఖ్యమంత్రి పూజలు.. అధికార నివాసంలోకి అడుగుపెట్టిన భట్టి విక్రమార్కEmbed
తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, అర్థిక, విద్యుత్ శాఖల మంత్రి మల్లు భట్టి విక్రమార్క గురువారం ఉదయం అధికారిక నివాసంలోకి అడగుపెట్టారు. తొలుత కుటుంబసమేతంగా అధికారిక నివాసం 'మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజా భవన్'లో పూజలు చేశారు. అనంతరం అక్కడే ఉన్న మైసమ్మ దేవాలయంలోనూ పూజలు నిర్వహించారు. ఆపై తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టేందుకు సచివాలయానికి వెళ్లారు. కార్యక్రమానికి భట్టి భార్య, కుమారులతో పాటు ఇతర కుటుంబీకులు, ఆయన అనుచరులు, కాంగ్రెస్ నేతలు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సీఎం అధికారిక నివాసంగా ఉన్న ప్రజాభవన్(ప్రగతి భవన్)ను భట్టికి కేటాయించేలా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసాన్ని వేరే ప్రాంతానికి మార్చాలని సర్కారు యోచిస్తోంది.