Vijay: విజయ్‌కు డిప్యూటీ సీఎం ఆఫర్..? తమిళనాడు రాజకీయాల్లో కొత్త చర్చ!
ఈ వార్తాకథనం ఏంటి
తమిళనాడు, పశ్చిమబెంగాల్ తదితర రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మరికొన్ని గంటల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా బీజేపీ, టీవీకే పార్టీల మధ్య పొత్తు అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది. ఆంగ్ల మీడియా కథనాల ప్రకారం పొత్తులో భాగంగా టీవీకే అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలని బీజేపీ ప్రతిపాదించినట్లు సమాచారం. ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. భాజపా వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం టీవీకేతో పొత్తుకు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని అంటున్నారు.
Details
టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ స్థానాలు
ఈ కూటమిలో భాగంగా టీవీకేకు సుమారు 80 అసెంబ్లీ స్థానాలు ఇవ్వడానికి బీజేపీ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. అంతేకాకుండా విజయ్‌కు డిప్యూటీ ముఖ్యమంత్రి పదవిని కూడా ఆఫర్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే విజయ్ మాత్రం ముఖ్యమంత్రి పదవిపైనే దృష్టి పెట్టినట్లు రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ అంశమే చర్చల్లో కీలకంగా మారిందని సమాచారం. ఇప్పటివరకు ఈ అంశంపై బీజేపీ లేదా టీవీకే నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాగా బీజేపీ లేదా డీఎంకే పార్టీలతో తమకు ఎలాంటి పొత్తులు ఉండవని విజయ్ గతంలోనే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ కూటమి గురించి వార్తలు రావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.