LOADING...
Pawan Kalyan: నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ.కార్యాలయాలు : పవన్‌ కళ్యాణ్ 
నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ.కార్యాలయాలు : పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan: నవంబర్ 1వ తేదీ నుంచి డి.డి.ఓ.కార్యాలయాలు : పవన్‌ కళ్యాణ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 23, 2025
03:21 pm

ఈ వార్తాకథనం ఏంటి

రాష్ట్రంలో స్థానిక సంస్థలను బలోపేతం చేస్తూ పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చినట్లు ఉపముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్ తెలిపారు. గురువారం పంచాయతీ రాజ్‌ శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమావేశమై పలు నిర్ణయాలు తీసుకున్నారు. నవంబర్‌ 1 నుండి రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, ఇంతకుముందు అమల్లో ఉన్న క్లస్టర్‌ విధానాన్ని రద్దు చేసి, మొత్తం 13,351 పంచాయతీలను స్వతంత్ర యూనిట్లుగా మలిచామని చెప్పారు. ఈ నిర్ణయంతో గ్రామీణ ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి అవకాశం కలుగుతుందని పవన్‌ కళ్యాణ్‌ పేర్కొన్నారు. పంచాయతీల్లో జరుగుతున్న పాలనా సంస్కరణల ఫలితాలు నేరుగా ప్రజలకు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

రాష్ట్రవ్యాప్తంగా ప్రాంతీయ అభివృద్ధి కార్యాలయాలు