LOADING...
Pawan Kalyan: ఆర్థిక సమస్యలున్నా.. సూపర్ సిక్స్ కార్యక్రమం కొనసాగింపు : పవన్ 
ఆర్థిక సమస్యలున్నా.. సూపర్ సిక్స్ కార్యక్రమం కొనసాగింపు : పవన్

Pawan Kalyan: ఆర్థిక సమస్యలున్నా.. సూపర్ సిక్స్ కార్యక్రమం కొనసాగింపు : పవన్ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Sep 10, 2025
05:00 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్‌ కార్యక్రమాలను కొనసాగిస్తున్నట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటించారు. అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 'సూపర్‌సిక్స్‌-సూపర్‌హిట్' బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రాయలసీమను రతనాల సీమగా మార్చేందుకు పూర్తిగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామన్నారు. ''ప్రతి కుటుంబానికి రూ.25 లక్షల విలువైన ఆరోగ్య బీమా కల్పించాం. ఒకే రోజు రికార్డు స్థాయిలో గ్రామసభలు నిర్వహించాం. కోటి మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. శాంతి, భద్రతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుబడి ఉన్నామని పవన్ కల్యాణ్ చెప్పారు.