White Paper on Economy: పార్లమెంట్‌లో 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం' ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
గత యుపిఎ ప్రభుత్వం,ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థ పనితీరును పోల్చడం లక్ష్యంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రభుత్వం 'భారత ఆర్థిక వ్యవస్థపై శ్వేతపత్రం'ను గురువారం పార్లమెంటులో ప్రవేశపెట్టారు. 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థ వారసత్వంగా యూపీఏ ప్రభుత్వానికి వచ్చిందని, 2014లో తాము అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన సంక్షోభాలను డాక్యుమెంట్‌లో ఆమె ప్రస్తావించారు. 2014లో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పుడు, దేశ ఆర్థిక వ్యవస్థ దుర్భలమైన స్థితిలో ఉందని, ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అధ్వాన్నంగా ఉంది,ఆర్థిక దుర్వినియోగం,ఆర్థిక క్రమశిక్షణారాహిత్యం ఉందని ఇది సంక్షోభ పరిస్థితి అని శ్వేతపత్రంలో పేర్కొన్నారు.
వారసత్వంగా వచ్చిన ఆర్థిక వ్యవస్థను ఉపయోగించుకోలేకపోయిన యుపిఎ
2014లో ప్రస్తుత ప్రభుత్వం బాధ్యతలు చేపట్టినప్పుడు ఆర్థిక పరిస్థితిని 'నష్టం వారసత్వం'గా అభివర్ణిస్తూ, 2004లో ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా అందించిన యూపీఏ ప్రభుత్వం వృద్ధిని సాధించడంలో విఫలమైందని ప్రభుత్వం తన శ్వేతపత్రంలో పేర్కొంది. యుపిఎ ప్రభుత్వం మరిన్ని సంస్కరణలకు సిద్ధంగా ఉన్న ఆరోగ్యకరమైన ఆర్థిక వ్యవస్థను వారసత్వంగా పొందింది. కానీ దశాబ్ధ కాలాన్ని ఉపయోగించుకోలేదని ఆరోపించింది.యూపీఏ ప్రభుత్వంలో నాయకత్వ సంక్షోభం ఉందని, ప్రభుత్వం జారీ చేసిన ఆర్డినెన్స్‌ని చింపివేయడం సిగ్గుచేటని శ్వేతపత్రం ఆరోపించింది.