
Chandrababu: తిరుమల తరహాలో శ్రీశైలం క్షేత్రం అభివృద్ధి : సీఎం చంద్రబాబు ఆదేశాలు
ఈ వార్తాకథనం ఏంటి
శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జున స్వామి దేవస్థానం అభివృద్ధి పై సమగ్ర సమీక్షను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తదితర ఉన్నత అధికారులు హాజరయ్యారు. సమావేశంలో జ్యోతిర్లింగం, శక్తిపీఠం కలిగిన దివ్యక్షేత్రంగా శ్రీశైలం ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చ జరిగింది. ప్రతేడాది లక్షల సంఖ్యలో భక్తులు చేరే నేపథ్యంలో, వారికి మెరుగైన సౌకర్యాలను అందించే ప్రణాళికలను సమీక్షించారు.
Details
అభివృద్ధి విధానం
తిరుమల తరహా అభివృద్ధి శ్రీశైలం క్షేత్రాన్ని తిరుమల తరహాగా అభివృద్ధి చేసేలా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఆధ్యాత్మిక, పర్యాటక, పర్యావరణ అభివృద్ధి శ్రీశైలం ప్రాంతాన్ని అన్ని కేంద్రీకృత అంశాల్లో అభివృద్ధి చేయడానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు సూచించారు. భూమి కేటాయింపు ఆలయ అభివృద్ధి కోసం 2,000 హెక్టార్ల భూమిని దేవాదాయశాఖకు కేటాయించడానికి కేంద్రానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం
Details
రహదారులు మరియు సౌకర్యాలు
శ్రీశైల క్షేత్రాన్ని జాతీయ రహదారులతో అనుసంధానించడం, భక్తుల కోసం సౌకర్యాలను విస్తరించడంపై ముఖ్యమంత్రి సూచనలు. పులుల అభయారణ్యం అభివృద్ధి పర్యావరణ పరంగా పులుల అభయారణ్యాన్ని కూడా అభివృద్ధి చేయాలని సూచించారు. భక్తుల వృద్ధి & సౌకర్యాలు భక్తుల సంఖ్య ఏటా పెరుగుతున్న కారణంగా, ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున వచ్చే భక్తుల కోసం సౌకర్యాలను విస్తరించాలని సూచించారు. శబరిమల సహా ఇతర ప్రసిద్ధ దేవాలయాల్లోని సౌకర్యాలపై పరిశీలన చేసి శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేయాలని డిప్యూటీ సీఎం అభిప్రాయపడ్డారు.