
Chadrababu: సర్క్యులర్ ఎకానమీతో అభివృద్ధి.. జీవన ప్రమాణాల పెంపునకు ప్రణాళికలు సిద్ధం : సీఎం
ఈ వార్తాకథనం ఏంటి
ప్రజల సంక్షేమం, ప్రకృతి పరిరక్షణ, ఆధునిక సాంకేతికత, స్పష్టమైన దృష్టికోణం ఈ నాలుగు మూలస్థంభాల ఆధారంగా పాలన సాగితే ఉత్తమ ఫలితాలు సాధ్యమవుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ప్రజలకు నాణ్యమైన జీవన ప్రమాణాలు అందించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని తెలిపారు. ఈ క్రమంలో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (GSDP), అభివృద్ధి సూచికలపై సచివాలయంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఆర్థికాభివృద్ధితో పాటు రాష్ట్ర ప్రజల జీవన నాణ్యత కూడా అత్యంత ప్రాధాన్యమయిన అంశమని చెప్పారు. ప్రభుత్వం రూపొందించే ప్రతి పథకాన్ని కుటుంబాన్ని యూనిట్‌గా తీసుకుని రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. కనీస అవసరాలను ప్రతి ఇంటికి చేరవేయాలని అన్నారు.
Details
తలసరి ఆదాయం లక్ష్యాలు
2025-26 నాటికి రాష్ట్ర తలసరి ఆదాయాన్ని రూ. 3,47,871కు, 2029 నాటికి రూ. 5.42 లక్షలకు చేరేలా ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. దీని కోసం అన్ని శాఖలు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక లక్ష్యాలను నిర్దేశించుకుని పని చేయాలని తెలిపారు. ఆదాయ వృద్ధికి ప్రణాళికలు ప్రతి పథకం ద్వారా ప్రజల ఆదాయం పెరగేలా చేయాలని, ముడి సరుకుల వినియోగాన్ని మెరుగుపరచి ఉత్పత్తుల విలువను పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సీఎం వివరించారు. సర్క్యులర్ ఎకానమీపై దృష్టి ఒక పరిశ్రమలో తయారైన వ్యర్థాలు మరొక పరిశ్రమకు ముడి పదార్థంగా మారేలా సర్క్యులర్ ఎకానమీ ఏర్పాటు చేయాలని అన్నారు. ఇది సంపదను సృష్టించడంలో కీలకమవుతుందని వివరించారు.
Details
సాంకేతికత అనుసంధానం
ప్రశాంత, పారదర్శక పాలనకు ఆధునిక సాంకేతికతను వినియోగించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ప్రజల జీవన నాణ్యత పెరగాలంటే సేవల ప్రదానం కూడా సమర్థవంతంగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేశారు. వ్యవసాయం, మైనింగ్‌లో విలువ జోడింపు రాష్ట్ర స్థూల ఉత్పత్తిని పెంచడంలో వ్యవసాయం, మైనింగ్ రంగాల్లో జి.వి.ఏ (Gross Value Added) కీలకంగా ఉండనున్నదని పేర్కొన్నారు. ఉత్పత్తుల్లో విలువను జోడించాలంటే ఆధునిక పద్ధతులను ఉపయోగించాల్సిన అవసరం ఉందని సూచించారు. ఏపీ లక్ష్యం ఇదే ప్రజల ఆదాయాన్ని పెంచుతూ, సంక్షేమం అందిస్తూ, దేశంలో అత్యధిక తలసరి ఆదాయాన్ని కలిగిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ దృష్టి అని సీఎం చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.