NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ
    కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ

    వ్రాసిన వారు Sirish Praharaju
    Jun 04, 2025
    06:51 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    ద్రావిడ భాషల్లో అత్యంత పురాతన భాష తమిళం అని భాషా శాస్త్రవేత్తలు చెబుతారు.

    అయితే ఇటీవలి కాలంలో ప్రముఖ నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్ని రేపాయి.

    ఆయన వ్యాఖ్యల ప్రకారం కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందని అన్నారు.

    ఈ వ్యాఖ్యలు కర్ణాటకలో తీవ్ర దుమారాన్ని రేపాయి. వివాదం చివరకు కోర్టు వరకూ చేరింది.

    ఈ నేపథ్యంలో అసలు మన దేశంలో ఈ భాషల ప్రాముఖ్యత ఏంటి, వాటి చరిత్ర ఏంటో తెలుసుకుందాం.

    వివరాలు 

    కమల్ హాసన్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇవే 

    'థగ్ లైఫ్'అనే సినిమా ఆడియో విడుదల వేడుకలో కమల్ హాసన్ మాట్లాడుతూ,"కన్నడ భాష తమిళం నుంచి పుట్టింది"అనే వ్యాఖ్య చేశారు.

    ఈ మాటలు కర్ణాటకలోని అనేక సంఘాల, నేతల, రాజకీయ పార్టీల ఆగ్రహానికి గురయ్యాయి.

    ఆయనపై విమర్శలు వెల్లువెత్తాయి. అయన తక్షణం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేసినా, కమల్ తన వ్యాఖ్యలపై నిలబడి,అందులో తప్పేమీ లేదని చెప్పారు.

    దీనిపై తీవ్ర అసంతృప్తితో కోర్టు కూడా స్పందించింది.

    "మీరు చరిత్రకారులా?భాషా శాస్త్రవేత్తలా?ఇలా వ్యాఖ్యలు ఎలా చేస్తారు?"అని కోర్టు ప్రశ్నలు సంధించింది.

    అంతే కాక,"ఒక్క క్షమాపణ చెప్పి ఉంటే ఈ సమస్య ఇంతకు ముందే పరిష్కారమయ్యేది కదా?"అని కూడా అడిగింది.

    కానీ కమల్ తన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పకపోగా ,తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారన్నారు.

    వివరాలు 

    ద్రవిడ భాషలకు తల్లిలాంటిది ప్రోటో - ద్రావిడ

    భారతదేశంలో ద్రావిడ భాషలు అనేకం ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనవి: తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, తుళు మొదలైనవి.

    ఇవన్నీ ప్రోటో ద్రావిడ భాష అనే పురాతన మూల భాష నుంచి ఉద్భవించాయని భాషా శాస్త్రవేత్తలు అంటున్నారు.

    ఈ భాషను సుమారు 4000-4500 సంవత్సరాల క్రితం మాట్లాడి ఉండవచ్చని అంచనా. సింధు నాగరికత కాలంలో ఇది ఉన్నట్లు చరిత్రకారుల అభిప్రాయం.

    వివరాలు 

    ద్రావిడ భాషల వర్గీకరణ:

    భాషా శాస్త్రవేత్తలు ద్రావిడ భాషలను నాలుగు వర్గాలుగా విడగొట్టారు:

    దక్షిణ ద్రావిడ భాషలు: తమిళం, కన్నడ, మలయాళం, తుళు, కొడవ, తోడా, కోట, బడగ, ఇరుల, కొరగ, కుడియా

    విశేషాలు: తమిళం అత్యంత పురాతన భాష. క్రీ.పూ. 3వ శతాబ్దానికి చెందిన సంగం సాహిత్యం ఉంది.

    కన్నడం కర్ణాటక అధికార భాష. దీని సాహిత్య చరిత్ర గొప్పది. మలయాళం కేరళ అధికార భాష. తుళు, కొడవ, తోడా, బడగ మొదలైనవి కొన్ని భౌగోళిక ప్రాంతాల్లో మాత్రమే మాట్లాడే స్థానిక భాషలు.

    వివరాలు 

    2. దక్షిణ-మధ్య ద్రావిడ భాషలు: 

    భాషలు: తెలుగు, గోండి, కోయ, కొండ, కుయి, పెంగు, మండ, కువి

    విశేషాలు: తెలుగు అత్యంత పెద్ద భాష, సుదీర్ఘ చరిత్ర కలిగి ఉంది. క్రీ.శ. 575 నాటి రేనాటి చోడుల శాసనం తెలుగు భాషలో మొదటిది.

    గోండి, కొండ, కుయి, కువి వంటి భాషలు ఎక్కువగా గిరిజన సమూహాలు మాట్లాడే భాషలు.

    కొన్ని భాషలు (మాండ్, కుయి) యునెస్కో చేత అంతరించిపోతున్న భాషలుగా గుర్తించబడ్డాయి.

    వివరాలు 

    3. మధ్య ద్రావిడ భాషలు:

    భాషలు: కొలామి, నాయకి, గదబ, పర్జి, ఒల్లారి

    విశేషాలు: ఇవి ముఖ్యంగా ఒడిశా, మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో గిరిజనులు మాట్లాడే భాషలు.

    4. ఉత్తర ద్రావిడ భాషలు:

    భాషలు: కురుఖ్, మాల్తో, బ్రహుయ్

    విశేషాలు: బ్రహుయ్ పాకిస్థాన్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో మాట్లాడే భాష. కురుఖ్ కి "కరూఖలే" అనే పదం మహాభారతంలో ఉండటం, ఈ భాషలకు ప్రాచీనతకు నిదర్శనం.

    వివరాలు 

    కమల్ హాసన్ వ్యాఖ్యలలో తప్పేమిటి? 

    తమిళం,కన్నడం,తెలుగు,మలయాళం..ఇవన్నీ ప్రోటో ద్రావిడ భాష నుంచి అభివృద్ధి చెందినవే కానీ ఒక భాష మరొక భాషను పుట్టించిందని చెప్పలేం.

    మలయాళం 9వ శతాబ్దంలో తమిళం నుంచి విడిపోయినట్లు కనిపించినా,భాషా శాస్త్రవేత్తలు మలయాళం తమిళం నుంచే పుట్టిందని స్పష్టం చేయరు.

    వాటి మూలం ప్రోటో ద్రావిడే.అదే విధంగా కన్నడ భాష కూడా ప్రోటో ద్రావిడ నుండి అభివృద్ధి చెందిన స్వతంత్ర భాష.

    తమిళం కన్నడకు తల్లి భాష కాదని, రెండు సోదర భాషలు అని చెప్పడం చక్కగా సరిపోతుంది.

    వివరాలు 

    కమల్ హాసన్ వ్యాఖ్యలలో తప్పేమిటి? 

    కమల్ హాసన్ "తమిళం నుంచి కన్నడ పుట్టింది" అని అన్నదంతే తప్పుగా అర్థమవుతుంది.

    వాస్తవానికి కమల్ తమిళం, కన్నడం భాషలను సోదర భాషలుగా అభివర్ణించుంటే, అంత వివాదం కూడా రాకపోయేది.

    సంక్షిప్తంగా: ద్రావిడ భాషలన్నీ ఒకే మూలమైన ప్రోటో-ద్రావిడ భాష నుంచి వేరుచేయబడ్డవే తప్ప, ఒక భాష మరొకదానినుండి పుట్టలేదు. అందుచేత, కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలు భాషా శాస్త్రానికి విరుద్ధమని చెప్పాలి.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    కమల్ హాసన్

    తాజా

    #NewsBytesExplainer: కన్నడకు మూలం తమిళమా? కమల్ హాసన్ వివాదాస్పద వ్యాఖ్యలపై విశ్లేషణ కమల్ హాసన్
    Bengaluru: ఆర్‌సిబి విజయోత్సవ వేడుకల్లో విషాదం.. తొక్కిసలాటలో 8మంది మృతి బెంగళూరు
    Tomato: ప్రాణాంతక బ్యాక్టీరియాతో టమాటోలు.. అమెరికాలో సాల్మొనెల్లా కలకలం! అమెరికా
    TG Inter Board: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. పాఠ్య పుస్తకాల ముద్రణ, పంపిణీ కార్యక్రమం ప్రారంభం తెలంగాణ

    కమల్ హాసన్

    చెన్నై ఎయిర్ పోర్టులో ఇండియన్ 2 షూటింగ్ ని అడ్డుకున్న అధికారులు: కోటి రూపాయలు చెల్లించినా నో పర్మిషన్  సినిమా
    ఆమె ఎంతోమంది షర్మిలలను సృష్టించాలి.. అందుకే కారును గిఫ్ట్‌గా ఇస్తున్నానన్న కమల్‌ హాసన్ తమిళనాడు
    అమెరికా వీధుల్లో కమల్ హాసన్: ప్రాజెక్ట్ కె కోసం హాలీవుడ్ చేరుకుంటున్న నటులు  ప్రాజెక్ట్ కె
    మా అందరి కంటే నువ్వు గొప్పవాడివి: కమల్ హాసన్ పై అమితాబ్ పొగడ్తలు  ప్రభాస్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025