
Cyber criminals: బెంగళూరులో డిజిటల్ అరెస్ట్ స్కాం.. ఇద్దరు మహిళలను నగ్నంగా ఉంచి వీడియో తీసిన మోసగాళ్లు
ఈ వార్తాకథనం ఏంటి
బెంగళూరులో సైబర్ నేరగాళ్లు మరోసారి రెచ్చిపోయారు. తాము పోలీసులమని నమ్మబలికి ఇద్దరు మహిళలను బెదిరించారు. అపై ఆగకుండా వారి రహాస్య వీడియోలను తీసి బెదిరింపులకు పాల్పడ్డారు. సైబర్ మోసగాళ్లు బాధితులపై దాదాపు తొమ్మిది గంటలపాటు మానసిక, డిజిటల్ వేధింపులకు పాల్పడినట్లు తెలిసింది.
Details
ఎలా జరిగింది
జూలై 17న ఉదయం 11 గంటల సమయంలో నవీ ముంబయిలోని కొలాబా పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నానంటూ ఓ నేరగాడు ఆమెతో మాట్లాడాడు. ఆమెపై మనీలాండరింగ్, మానవ అక్రమ రవాణా, హత్యల ఆరోపణలు ఉన్నాయని చెప్పాడు. ఆమెను బలవంతంగా నమ్మించడానికి నకిలీ అరెస్ట్ వారెంట్, సీబీఐ ఐడీ కార్డులు చూపించాడు. ఈ క్రమంలోనే రిచా బెంగళూరులో నివసిస్తున్న తన చిన్ననాటి స్నేహితురాలు అన్నేకు ఈ విషయం చెప్పింది. ఇద్దరూ కలిసే మాట్లాడుతుండగా, మరికొంతమంది కాల్‌లోకి చేరి తాము సీబీఐ అధికారులు అంటూ వీడియో కాల్‌కు కనెక్ట్ అయ్యారు. 'డిజిటల్ అరెస్ట్'లో ఉన్నారని, ఇంట్లోనే ఉండి వీడియో కాల్ ఆఫ్ చేయకుండా ఉండాలని తెలిపారు.
Details
డబ్బు వసూలు.. మానసిక వేధింపులు
పన్ను మోసానికి సంబంధించిన డబ్బు ఖచ్చితంగా తెలపాలని చెప్పిన మోసగాళ్లు, వారు చెప్పిన ఖాతాలోకి డబ్బు పంపితే తిరిగి ఇస్తామన్నారు. నమ్మిన రిచా రూ. 58,447 పంపించింది. అనంతరం రిజర్వ్ బ్యాంక్ రూల్స్ ప్రకారం ట్రాన్సాక్షన్లను ఫిజికల్ వెరిఫికేషన్ చేయాల్సిందేనని, అందుకు మెడికల్ పరీక్ష అవసరమన్నారు. నగ్నంగా ఉండమన్న మోసగాళ్లు 'గాయాలూ, మచ్చలూ ఉన్నాయా?' అన్న పేరుతో ఇద్దరినీ వీడియో కాల్‌లో నగ్నంగా ఉండమని బెదిరించారు. ఇద్దరూ ఆదేశాలను అమలు చేశారు. కానీ వారిని ఆ సమయంలో రహస్యంగా వీడియోలు తీసారు. అంతటితో ఆగలేదు.. ఆ మహిళలను బాడీ షేమ్ చేస్తూ మాటలతో దూషించారు.
Details
అంతలోనే అలెర్ట్ అయిన స్నేహితుడు
సాయంత్రం 8 గంటల సమయంలో రిచా తన స్నేహితుడికి వాట్సాప్‌లో జరిగినదంతా తెలిపింది. అతడు వెంటనే ఇది స్కామ్ అని గుర్తించి కాల్‌ను ఆపమని సూచించాడు. కాల్ నిలిపేయగానే నేరగాళ్లు బెదిరింపులకు దిగారు. మహిళల నగ్న వీడియోలను లీక్ చేస్తామని మెసేజ్‌లు పంపించారు. ఈ ఘటనపై తూర్పు సీఈఎన్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.