తదుపరి వార్తా కథనం
Digital data protection bill 2023: డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఆమోదించిన రాజ్యసభ
వ్రాసిన వారు
Sriram Pranateja
Aug 09, 2023
08:33 pm
ఈ వార్తాకథనం ఏంటి
డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్ 2023 ని రాజ్యసభ ఆమోదించింది. ఆగస్టు 7వ తేదీన లోక్‌సభ లో ఆమోదం పొందిన డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లును ఈరోజు రాజ్యసభ ఆమోదించింది.
గోప్యతా హక్కు అనేది ప్రాథమిక హక్కుగా అభివర్ణించబడుతుందని 2016లో సుప్రీం కోర్టు వెల్లడి చేసినప్పటి నుండి ఈ చట్టం రావాలని చాలామంది కోరుకున్నారు.
ఈ మేరకు వ్యక్తిగత సమచార సంరక్షణ బిల్లు అనే ప్రతిపాదన ముందుకు వచ్చింది. 2019నుండి రెండు సంవత్సరాల పాటు ఈ బిల్లులో అనేక సవరణలు జరిగాయి.
2022లో దీనికి మరికొన్ని సవరణలు చేరి డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుగా మారింది. ప్రస్తుతం ఈ బిల్లుకు రాజ్యసభ ఆమోదముద్ర వేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
డిజిటల్ డేటా ప్రొటెక్షన్ బిల్లుకు రాజ్యసభలో ఆమోదం
#NewsFlash | The Digital Personal Data Protection Bill, 2023 passed in Rajya Sabha#RajyaSabha #DataProtectionBill #DataProtection pic.twitter.com/ikLlptLqpq
— CNBC-TV18 (@CNBCTV18Live) August 9, 2023