
Andhra Pradesh: సభాసార్ పోర్టల్ ద్వారా పంచాయతీ తీర్మానాల డిజిటల్ డాక్యుమెంటేషన్
ఈ వార్తాకథనం ఏంటి
గ్రామసభలలో జరిగే చర్చలను ఇకపై ప్రత్యేకంగా రికార్డ్ చేయాల్సిన అవసరం ఉండదు. కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వశాఖ కొత్తగా ప్రవేశపెట్టిన కృత్రిమ మేధ (AI) టూల్ ద్వారా ఈ చర్చలను తక్షణమే డాక్యుమెంటేషన్ చేయడం సాధ్యమవుతుంది. గ్రామసభల వీడియోలను 'సభాసార్' పోర్టల్‌లో అప్‌లోడ్ చేస్తే సరిపోతుంది. డాక్యుమెంట్‌ని తీర్మానం కింద పంచాయతీల్లో భద్రపరుచుకోవచ్చు ఈ ఆధునిక సాంకేతికతను మొదటిగా గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చింతలపూడి పంచాయతీలో సోమవారం ప్రయోగాత్మకంగా ప్రారంభించారు.
వివరాలు
పంచాయతీలలో దశల వారీగా అమలు చేయాలని ప్రణాళిక
ఆ రోజు గ్రామసభలో, పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించడానికి సింగిల్ యూజ్ ప్లాస్టిక్‌ను నిషేధించాలన్న తీర్మానాన్ని సర్పంచి టి. రామకృష్ణ అధ్యక్షతన సమీక్షించారు. దీనికి సంబంధించిన గ్రామసభ వీడియోను 'సభాసార్' పోర్టల్‌లో అప్‌లోడ్ చేసిన వెంటనే AI టూల్ ద్వారా డాక్యుమెంటేషన్ పూర్తయ్యింది. ఈ విధానాన్ని రాష్ట్రంలోని అన్ని పంచాయతీలలో దశల వారీగా అమలు చేయాలని ప్రణాళిక పెట్టారు. అదేవిధంగా, అదే గ్రామంలో స్వామిత్వ పథకం ప్రకారం 708 కుటుంబాలకు గ్రామకంఠాల్లోని ఇళ్లు మరియు ఖాళీ స్థలాలపై హక్కులు కల్పించబడ్డాయి. సమిత్వ ప్రాజెక్టు డైరెక్టర్ ఎ. నిషాంత్‌రెడ్డి మీడియాకు దీన్ని వివరించారు.