LOADING...
Air India Flight Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం  
ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం

Air India Flight Crash : అహ్మదాబాద్‌లో ఎయిర్ ఇండియా విమాన శిథిలాల నుండి డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం  

వ్రాసిన వారు Sirish Praharaju
Jun 13, 2025
02:38 pm

ఈ వార్తాకథనం ఏంటి

అహ్మదాబాద్‌లో చోటుచేసుకున్న విమాన ప్రమాదంపై డీజీసీఏ (DGCA), ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB)తో పాటు గుజరాత్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) అధికారులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. ఈ దర్యాప్తు క్రమంలో మరో ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. ప్రమాదానికి గురైన బోయింగ్‌ 787-8 డ్రీమ్‌లైనర్‌ విమాన శకలాల నుంచి గుజరాత్ ఎయిర్ టెర్రరిజం స్క్వాడ్ (ఏటీఎస్) డిజిటల్ వీడియో రికార్డర్ (DVR)ను స్వాధీనం చేసుకుంది.

ట్విట్టర్ పోస్ట్ చేయండి

డిజిటల్ వీడియో రికార్డర్ స్వాధీనం  

వివరాలు 

వీడియో డేటా రికవరీపై దృష్టి 

ఈ DVR ద్వారా విమాన ప్రమాదం సంభవించే ముందు ప్రయాణ సమయంలో ఫ్లైట్ లోపల ఏం జరిగిందో పూర్తిగా వీడియో రూపంలో రికార్డయి ఉండే అవకాశముంది. అధికారులు ప్రస్తుతం ఆ వీడియో డేటాను రికవరీ చేయడంపై దృష్టి పెట్టారు. ఇదే సమయంలో మరో కీలకమైన పరికరం అయిన బ్లాక్ బాక్స్‌ను కూడా స్వాధీనం చేసుకునే అవకాశముంది. అదే జరిగితే ప్రమాదానికి సంబంధించిన పూర్తి నివేదికను అధికారులు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉంది.