Loading...
Dimagi Naxal Party: 'దిమాగీ నక్సల్ పార్టీ' ఇన్‌స్టా పేజీకి 24 గంటల్లోనే 1.6 లక్షల మంది ఫాలోవర్లు
'దిమాగీ నక్సల్ పార్టీ' ఇన్‌స్టా పేజీకి 24 గంటల్లోనే 1.6లక్షల మంది ఫాలోవర్లు

Dimagi Naxal Party: 'దిమాగీ నక్సల్ పార్టీ' ఇన్‌స్టా పేజీకి 24 గంటల్లోనే 1.6 లక్షల మంది ఫాలోవర్లు

వ్రాసిన వారు Sirish Praharaju
Aug 17, 2026
11:10 am

ఈ వార్తాకథనం ఏంటి

'దిమాగీ నక్సల్ పార్టీ' పేరుతో ఓ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. ఈ ఖాతా కేవలం 24 గంటల్లోనే 1.6 లక్షలకు పైగా ఫాలోవర్లను సంపాదించుకుంది. ఈ విషయాన్ని ఎన్‌డీటీవీ కూడా నివేదించింది. ఈ ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ప్రస్తుతం 62 పోస్టులు ఉన్నాయి. అలాగే సుమారు 35 మందిని ఈ ఖాతా ఫాలో అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో కనిపిస్తున్న వివరాల ప్రకారం.. ఈ అకౌంట్‌ను ఈ నెలలోనే తెరిచారు. ఖాతా ప్రారంభించిన తర్వాత యూజర్‌నేమ్‌ను ఒకసారి మార్చినట్లు లాగ్‌లో కనిపిస్తోంది. అయితే ఈ అకౌంట్‌ను ఎవరు నిర్వహిస్తున్నారనే విషయం మాత్రం వెల్లడికాలేదు.

వివరాలు 

దేశాన్ని ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చాం: మోదీ 

ప్రధాని నరేంద్ర మోదీ స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో 'దిమాగీ నక్సల్' అనే పదాన్ని ఉపయోగించిన నేపథ్యంలో ఈ పేరు ఇప్పుడు చర్చకు వచ్చింది.

మావోయిస్టులపై ప్రభుత్వం సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ..అడవుల్లో ఆయుధాలు పట్టిన నక్సలైట్లను అంతం చేయడంలో విజయం సాధించామని మోదీ చెప్పారు.

అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు తగ్గిపోయినా..భావజాలపరంగా సమాజంలో ప్రభావం చూపేందుకు ప్రయత్నించే 'దిమాగీ నక్సల్స్'ఇంకా ఉన్నారని ఆయన హెచ్చరించారు.

"ఆయుధాలు పట్టిన నక్సలైట్లను అడవుల నుంచి అంతమొందించడంలో విజయం సాధించాం. దేశాన్ని ఆ సంక్షోభం నుంచి బయటకు తీసుకొచ్చాం. అయితే ఆయుధాలు పట్టిన నక్సలైట్లు లేకపోయినా.. దిమాగీ (మేధోపరమైన) నక్సల్స్ చుట్టుపక్కలే ఉన్నారు" అని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.

ఈ వ్యాఖ్యలపై రాజకీయంగా కూడా చర్చ మొదలైంది.

ADVERTISEMENT