Telangana: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్‌ల పిటిషన్ కొట్టివేత
డీవోపీటీ ఉత్తర్వులపై ఐఏఎస్ అధికారులు వాణి ప్రసాద్, వాకాటి కరుణ, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్‌లకు హైకోర్టులోనూ ఊరట లభించలేదు. రిలీవ్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలన్న వారి పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ మేరకు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఐఏఎస్ అధికారుల తరఫున న్యాయవాది ట్రైబ్యునల్ విచారణ నవంబర్ 4న ఉన్నందున, అప్పటివరకు రిలీవ్ చేయోద్దని కోరారు. అయితే ఈ విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు.
ప్రశ్నల వర్షం కురిపించిన హైకోర్టు
స్టే ఇస్తే ఈ వ్యవహారం ఎన్నటికీ తేలదని కోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. వారంతా బాధ్యతాయుతమైన అధికారులు, ప్రజలకు ఇబ్బంది కలగించకూడదని, ఎవరెక్కడ పనిచేయాలనేది కేంద్రం నిర్ణయిస్తుందన్నారు. మరోసారి పరిశీలించాలని డీవోపీటీని ఆదేశించమంటారా అని హైకోర్టు ప్రశ్నించింది. అయితే క్యాట్ తుది తీర్పు ఇచ్చే వరకు రిలీవ్ చేయవద్దని ఐఏఎస్‌ల తరఫు న్యాయవాది కోరారు. అయితే హైకోర్టు ఈ అభ్యర్థనను నిరాకరించింది. తుది వాదనలు విన్న హైకోర్టు, ఐఏఎస్‌ల పిటిషన్‌ను కొట్టివేసి తగిన ఆదేశాలు జారీ చేసింది.