జమ్ముకశ్మీర్ డీలిమిటేషన్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత-సుప్రీంకోర్టులో కేంద్రానికి ఊరట
జమ్ముకశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్వవ్యస్థీకరణను సమర్ధిస్తూ సుప్రీంకోర్టు సోమవారం తీర్పు చెప్పింది. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్, జస్టిస్ ఏఎస్ ఓకాలతో కూడిన ధర్మాసనం జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది. ఈ తీర్పు 370కి సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రభావం చూపదని ధర్మాసనం చెప్పింది. 2021జనాభా లెక్కల ఆధారంగా జమ్ముకశ్మీర్‌లో డీలిమిటేషన్‌ను లోక్‌సభ సీట్లతో పాటు చేపట్టాలని, ప్రత్యేకంగా జమ్ము, కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో చేపట్టడం తగదని అబ్దుల్ గనీ ఖాన్, మహ్మద్ అయూబ్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వీరి తరఫున న్యాయవాది శ్రీరామ్ వాదనలు వినిపించారు. డీలిమిటేషన్ ప్రక్రియ బీజేపీకి అనుకూలంగా ఉందని శ్రీరామ్ ధర్మాసనం ఎదుట వాదించారు. ఇది ఎన్నికల సంఘం పరిధిలోనిదని స్పష్టం చేశారు.
జమ్ముకశ్మీర్‌లో 90కి పెరిగిన అసెంబ్లీ సీట్లు సంఖ్య
మే 5, 2022న ముగ్గురు సభ్యుల డీలిమిటేషన్ కమిషన్ జమ్ము, కాశ్మీర్‌కేంద్ర పాలిత ప్రాంతాల కొత్త ఎన్నికల మ్యాప్‌ను ఖరారు చేసింది. హిందువులు మెజారిటీ సంఖ్యలో ఉన్న జమ్ము ప్రాంతానికి 43 సీట్లు, ముస్లింలు మెజారిటీ సంఖ్యలో ఉన్న కశ్మీర్‌కు 47 సీట్లను ముగ్గురు సభ్యుల డీలిమిటేషన్ ప్రతిపాదించింది. ఈ క్రమంలో అంతకుముందు 83 అసంబ్లీ స్థానాలు ఉండగా, ఆ సంఖ్యను 90కి పెంచింది. కొత్తగా చేరిన ఏడు సీట్లలో ఆరు జమ్ముకి, ఒకటి కాశ్మీర్‌కు కేటాయించారు. గతంలో జమ్ములో 37 సీట్లు, కశ్మీర్‌లో 46సీట్లు ఉన్నాయి. కశ్మీర్‌లో మొత్తం సీట్లలో 55.4శాతం నుంచి 52.2%కి తగ్గింది. జమ్ము ప్రాతినిధ్యం 44.6% నుంచి 47.8%కి పెరిగింది.