బీబీసీ బ్యాన్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు సీరియస్
ఈ వార్తాకథనం ఏంటి
భారత్‌లో బీబీసీ ఛానల్ ప్రసారం కాకుండా బ్యాన్ చేయాలని వేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టి వేసింది. హిందూసేన ఈ పిటిషన్ వేయగా.. దీనిపై సర్వోన్నత న్యాయస్థానం తిరస్కరించింది.
గుజరాత్ అల్లర్లపై బీబీసీ చిత్రీకరించిన డాక్యుమెంటరీ తప్పుదోవ పట్టించేలా ఉందని కేంద్రం బ్యాన్ విధించింది. సోషల్ మీడియాలో ఎక్కడా ఈ వీడియో క్లిప్‌లు కనిపించకుండా సెన్సార్ విధించింది. ఈ క్రమంలో హిందూసేన అసలు బీబీసీ ఛానల్ నే సెన్సార్ చేయాలంటూ సుప్రీంకోర్టుని అశ్రయించింది.
బీబీసీ 'ది ఇండియా ది మోదీ క్వశ్చన్ అనే డాక్యుమెంటరీని రూపొందించింది. దీనిపై బీజేపీ తీవ్ర అభ్యంతరం తెలిపింది.
బీజేపీ
మోదీకి వ్యతిరేకంగా డాక్యుమెంటరీ రూపొందించారు : బీజేపీ
భారతదేశానికి, భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీబీసీ వ్యవహరిస్తోందని పిటిషనర్ ఆరోపించారు. బీబీసీ రూపొందించిన డాక్యుమెంటరీ మోదీకి వ్యతిరేకంగా ఉందని బీజేపీ తెలిపింది.
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, అడ్వకేట్ ప్రశాంత భూషణ్...సుప్రీంకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేశారు.
2002లో జరిగిన గుజరాత్ అల్లర్లకు సంబంధించిన ఎన్నో నిజాలున్నాయని, వాటిని వెలుగులోకి తీసుకొస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని పిటిషన్‌లో పేర్కొన్నారు. సోషల్ మీడియాలో వీడియో లేకుండా చేయడాన్ని సవాలు చేశారు.