వివాదాస్పద వ్యాఖ్యలపై స్పందించిన తృణమాల్ మహిళా ఎంపీ
తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మహిళా ఎంపీ మహువా మొయిత్రా పార్లమెంట్ లో అభ్యంతకర వ్యాఖ్యలు చేయడంపై వివాదం రేగింది. అసభ్య పదజాలం వాడారని ఆరోపిస్తూ ఆమెను బీజేపీ టార్గెట్ చేసింది. మహిళా ఎంపీ క్షమాపణ చెప్పాలని కమలనాథులు డిమాండ్ చేయగా.. ఆమె తిరస్కరించారు. తాజాగా ఈ వ్యాఖ్యలపై తృణమాల్ ఎంపీ మహువా మొయిత్రా స్పందించారు. పార్లమెంట్‌లో అఫ్ ది రికార్డుగా ఓ పదం వాడానని, దాని అర్ధం మొదటగా గుర్తించుకోవాలని అధికార పక్షానికి సూచించారు. ఎంపీ రాహుల్ గాంధీ చేసిన ఆరోపణల్లోనూ అభ్యంతరకర పదాలు దొర్లడంతో వాటిని పార్లమెంట్ రికార్డుల నుంచి తొలగించాలని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా ఆదేశించారు.
వేరే అర్ధాన్ని గ్రహించారు: లోక్‌సభ ఎంపీ
తాను పార్లమెంట్‌లో దుర్భాషలాడలేదని, ఆ పదానికి అర్థం పాపాత్మురాలని పేర్కొన్నారు. అధికార పక్షం హిందీలో ఆ పదానికి వేరే అర్ధాన్ని గ్రహించారని, దీన్ని పెద్దగా పట్టించుకోని లోక్‌సభ ఎంపీ మహువా మొయిత్రా ఒక ఇంటర్వ్యూలో అన్నారు. తాను చెప్పింది తప్పో ఒప్పో కాదని, కానీ హౌస్‌లో ప్రొటెక్షన్ ఇవ్వాలని, తాను వివాదాస్పద వ్యాఖ్యల గురించి పెద్దగా పట్టించుకోనని ఈ సందర్భంగా మహువా మొయిత్రా వెల్లడించారు. పార్లమెంటులో బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి అని పిలిచినందుకు చాలా మంది బిజెపి ఎంపీలు తనను ప్రశంసించారని మహువా మోయిత్రా అన్నారు