
'నాలుకను అదుపులో ఉంచుకోవాలి', తృణమూల్ ఎంపీకి హేమ మాలిని వార్నింగ్
ఈ వార్తాకథనం ఏంటి
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపి మహువా మొయిత్రాపై బీజేపీ ఎంపీ హేమ మాలిని బుధవారం మండిపడ్డారు. అక్షేపణీయమైన పదాన్ని లోక్‌సభలో మహువా ఉపయోగించారని, నాలుకను అదుపులో పెట్టుకొని మాట్లాడలని సూచించారు.
రాష్ట్రపతి ప్రసంగంపై లోక్‌సభలో ధన్యవాద తీనం సందర్భంగా టీడీపీ ఎంపీ కె రామ్మోహన్ నాయుడు ప్రసంగిస్తుండగా మొయిత్రా నుంచి హేమ మాలినికి అక్షేపణీయమైన పదం' వినిపించింది. ఈ క్రమంలో హేమ మాలిని సీరియస్‌గా స్పందించారు.
అత్యుత్సాహం తగదని ప్రతి పార్లమెంటు సభ్యుడు గౌరవనీయమైన వ్యక్తే అని బుధవారం పార్లమెంటు వెలుపల విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
లోక్‌సభ
టిఎంసీ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పాలి: ప్రహ్లాద్ జోషి
టీఎంసీ ఎంపీ మహువా మోయిత్రా సభలో 'ఆక్షేపణీయమైన' పదాన్ని ఉపయోగించడంపై బీజేపీ సీనియర్ నాయకుడు, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి స్పందించారు. టిఎంసీ ఎంపీ మహువా మోయిత్రా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
తాను మహువా మోయిత్రాను క్షమాపణలు చెప్పాలని కోరతానని, ఒక వేళ వారు చెప్పకుంటే వారి విజ్ఞతకే వదిలేస్తానని చెప్పారు.
ఇదిలా ఉంటే, లోక్ సభలో బీజేపీ ఎంపీలు మొయిత్రాకు వ్యతిరేకంగా నిరసనకు దిగారు.
తృణమూల్ ఎంపీ క్షమాపణ చెప్పాలని జోషి డిమాండ్ చేస్తున్న వీడియోను పశ్చిమ బెంగాల్ బీజేపీ అధ్యక్షుడు సుకాంత మజుందార్ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.