Ajit Pawar:'వివాదాలు ముగియాలి': పవార్ కుటుంబం.. ఒకతాటిపైకి రావాలన్న అజిత్ తల్లి
ఈ వార్తాకథనం ఏంటి
పవార్ కుటుంబం మళ్లీ కలిసిపోతుందా? రాజకీయ విభేదాలను పక్కన పెట్టి పవార్ కుటుంబం ఒక్కటి కానుందా? ఈ ప్రశ్నకు ప్రస్తుతం అవుననే సమాధానం వస్తోంది.
తాజా పరిణామాలను పరిశీలిస్తే, ఈ దిశగా కొన్ని కీలక అడుగులు పడుతున్నట్లు కనపడుతోంది.
కుటుంబ పెద్ద శరద్ పవార్‌పై 2023 జూలైలో అజిత్ పవార్ తిరుగుబాటు ప్రకటించడంతో పవార్ కుటుంబం రెండు వర్గాలుగా చీలిపోయింది.
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని విభజించి, శివసేన-బీజేపీ మహాయుతి సర్కారులో చేరి, అజిత్ పవార్ పెద్దాయనకు పెద్ద షాకే ఇచ్చారు.
అప్పటి నుండి ఇద్దరు అగ్రనేతల మధ్య రాజకీయ విరుద్ధతలు కొనసాగుతున్నాయి.
వివరాలు
పెద్దాయన అంటే చాలా గౌరవం
తాజాగా,ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తల్లి ఆశా-తాయ్ పవార్ చేసిన వ్యాఖ్యలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేపాయి.
నూతన సంవత్సరం సందర్భంగా బుధవారం పండరీపూర్ శ్రీ విఠల రుక్మిణిమాయిలను ఆశా పవార్ దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ పవార్ కుటుంబంలో ఉన్న అన్ని విభేదాలు తొలగిపోవాలని, అజిత్ పవర్, శరద్ పవార్ మళ్లీ కలిసిపోవాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు.
"నా ప్రార్థనలు నెరవేరాలని ఆశిస్తున్నాను"అని ఆమె పేర్కొన్నారు.
ఎన్సీపీ సీనియర్ నేత ప్రఫుల్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
"శరద్ పవార్ మా తండ్రి లాంటివారు.తమ తేడాలను పక్కన పెట్టి ఆయనను ఎప్పుడూ గౌరవిస్తాం. పవార్ కుటుంబం మళ్లీ కలిస్తే చాలా ఆనందం కలుగుతుంది"అని ఆయన అన్నారు.
వివరాలు
పెద్దాయనతో అజిత్ భేటీ వెనుక..
మరొక ఎన్సీపీ సీనియర్ నాయకుడు నరహరి జిర్వాల్ కూడా ఈ అభిప్రాయానికి సమ్మతించారు.
"శరద్, అజిత్ పవార్ తిరిగి చేతులు కలిపితే, అది పార్టీ, కార్యకర్తలకు మేలు చేస్తుంది" అని ఆయన తెలిపారు.
ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు ఈ ప్రచారానికి ఊతాన్ని ఇచ్చాయి.
డిసెంబర్ 12న అజిత్ పవార్ తన కుటుంబంతో కలిసి శరద్ పవార్‌ను ఢిల్లీలో పుట్టినరోజు సందర్భంగా కలిశారు.
అప్పటి నుండి ఈ ప్రచారం మరింత బలపెట్టింది. అయితే అజిత్ పవార్ ఈ ప్రచారాన్ని తప్పు పట్టారు, కుటుంబ విషయాలు మాత్రమే మాట్లాడినట్టు, రాజకీయాల గురించి చర్చ జరగలేదని చెప్పారు.
ఎన్సీపీ రెండు వర్గాలుగా చీలిపోయిన తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల్లో అజిత్ పవార్ భారీ విజయాన్ని సాధించారు.
వివరాలు
మళ్లీ ఒక్కటవుతారా?
మహారాష్ట్రలో జరిగిన ఇటీవలికాలంలో అజిత్ పవార్ తన పార్టీతో 41 స్థానాలు గెలిచారు.
శరద్ పవార్ వర్గానికి కేవలం 10 సీట్లు వచ్చాయి. అజిత్ పవార్ మహాయుతి సంకీర్ణ సర్కారులో డిప్యూటీ సీఎం అయ్యారు, అలాగే రాష్ట్ర కేబినెట్‌లో 9 మంత్రి పదవులు సాధించి మరింత పవర్‌ఫుల్ అయ్యారు.
ఈ పరిస్థితుల్లో, అజిత్ పవార్, శరద్ పవార్ మధ్య అనుకూల వాతావరణం ఏర్పడింది.
అజిత్ తన కుటుంబంతో శరద్ పవార్ ఇంటికి వెళ్లడం, ఆమె తల్లి కూడా పవార్ కుటుంబం కలవాలని కోరుకోవడంతో చర్చలు పునరుద్ధరించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో పవార్ కుటుంబం మళ్లీ ఒక్కటై పెరిగే అవకాశాలపై మరిన్ని అంచనాలు ఉంటాయి.