తదుపరి వార్తా కథనం

Bathina Brothers: బత్తిన చేప మందుకు సర్వం సిద్ధం
వ్రాసిన వారు
Sirish Praharaju
May 20, 2024
03:15 pm
ఈ వార్తాకథనం ఏంటి
బత్తిన సోదరులు ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా చేప మందు పంపిణీకి సిద్ధమయ్యారు.
జూన్ 8 ఉదయం 11 గంటలనుంచి జూన్ 9 ఉదయం 11 గంటల వరకు ఉంటుందని ఆకుటుంబం ఇవాళ మీడియాకు చెప్పారు.
హైదరాబాద్ లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో దీనికి సంబంధించి ప్రభుత్వ సిబ్బందితో సహా కొన్ని స్వచ్ఛంధ సంస్ధలు వచ్చే వారి కోసం విసృతంగా ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆస్తమా, ఉబ్బసం, శ్వాస కోస సంబంధిత వ్యాధులతో బాధ పడే అనేక మంది దేశ, విదేశాలనుంచి వస్తారు.
ఈ చేప మందు పంపిణీ కొన్ని దశాబ్దాలుగా చేస్తున్నారు. రోగం నయం అవుతుందని చేప మందు కోసం వచ్చే వారి విశ్వాసం.