Diwali Holiday: షాకింగ్ న్యూస్.. దీపావళి సెలవు రద్దు.. కారణం ఇదే
దీపావళి పండుగ నేపథ్యంలో సోమవారం(13వ తేదీ) తెలంగాణ ప్రభుత్వం సెలవు ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో కేంద్రం ఎన్నికల సంఘం సెలవును రద్దు చేసింది. దీపావళి సెలవును 12వ తేదీకి మాత్రమే పరిమితం చేసింది. 13వ తేదీన దీపావళి సెలవు ఇవ్వాలన్న తెలంగాణ సర్కారు ప్రతిపాదనను ఎన్నికల సంఘం తిరస్కరించింది. 13న సమావేశాలు, శిక్షణాతరగతులు నిర్వహించే విషయంపై ముందే ఖరారు చేసిన షెడ్యూల్ ఉన్నందున ఆరోజున సెలవు ఇవ్వడం కుదరదని ఈసీ స్పష్టం చేసింది. ఆ రోజు సెలవు ఉంటే, ముందు అనుకున్న ప్రకారం కార్యక్రమాలు సజావుగా సాగవని ఈసీ పేర్కొంది. ఈ క్రమంలో ఆదివారం సెలవు యథావిధిగా కొనసాగనుంది.