Rajasthan's New Deputy CM: రాజస్థాన్ కొత్త డిప్యూటీ సీఎంలలో ఒకరైన 'రాయల్' దియా కుమారి ఎవరో తెలుసా?
రాజస్థాన్ కొత్త ఉప ముఖ్యమంత్రులలో ఒకరిగా దియా కుమారిని బిజెపి ఎంపిక చేసింది. ఆమె జనవరి 30, 1971న రాజకుటుంబంలో జన్మించింది. ఆమె తాత, మాన్ సింగ్ II, బ్రిటీష్ రాజ్ కాలంలో జైపూర్‌ని చివరిగా పాలించిన మహారాజు. దియా కుమారి తండ్రి, బ్రిగేడియర్ సవాయ్ భవానీ సింగ్, 1971 భారతదేశం-పాకిస్తాన్ యుద్ధంలో అతని పరాక్రమానికి మహావీర చక్ర అవార్డును అందుకున్నారు. రాజస్థాన్ ఉప ముఖ్యమంత్రిగా నియమితులైన ఆమె తన పాఠశాల విద్యను మహారాణి గాయత్రీ దేవి పాఠశాలలో పూర్తి చేసింది. జైపూర్‌లోని మహారాణి కళాశాల నుండి ఉత్తీర్ణత సాధించింది. ఆమె నరేంద్ర సింగ్‌ను వివాహం చేసుకుంది.
మాధోపూర్ నియోజకవర్గం నుంచి మొదటిసారిగా ఎమ్మెల్యే
జైపూర్ ప్రస్తుత మహారాజా పద్మనాభ్ సింగ్‌తో సహా వారికి ముగ్గురు పిల్లలు ఉన్నారు. దియా కుమారి 2018లో తన భర్తకు విడాకులు ఇచ్చింది. 2013లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత దియా కుమారి రాజకీయ ప్రయాణం మొదలైంది. నగరాల చుట్టుపక్కల అభివృద్ధి చెందని గ్రామీణ ప్రాంతాలలో సమగ్ర అభివృద్ధిపై ఎమ్మెల్యేగా ఆమె దృష్టి సారించారు. 2019లో, దియా కుమారి అత్యధిక మెజారిటీతో గెలిచి రాజ్‌సమంద్ నుండి పార్లమెంటు సభ్యురాలిగా జాతీయ స్థాయికి ఎదిగారు.
దియా కుమారి పేరు మీద ఫౌండేషన్
రాజకీయాలకు అతీతంగా,దియా కుమారి రెండు పాఠశాలలు, ట్రస్టులు,మ్యూజియంలు,హోటళ్లు, ప్రభుత్వేతర సంస్థలతో సహా అనేక వ్యాపారాలను నిర్వహిస్తోంది. ఆమె ఇతర సంస్థలతోపాటు మహారాజా సవాయి మాన్ సింగ్ II మ్యూజియం ట్రస్ట్,జైఘర్ ఫోర్ట్ ఛారిటబుల్ ట్రస్ట్‌లను కూడా పర్యవేక్షిస్తుంది. దియా కుమారి తన పేరు మీద ప్రిన్సెస్ దియా కుమారి ఫౌండేషన్ అనే ఫౌండేషన్‌ను కూడా నడుపుతోంది. ఇది వృత్తిపరమైన శిక్షణ,విద్య,జీవనోపాధి కల్పన ద్వారా మహిళలు,బాలికలకు సాధికారత కల్పించడంపై దృష్టి సారిస్తుంది. హెరిటేజ్ మేనేజ్‌మెంట్ అండ్ ఫిలోన్ త్రఫిలో ఆమె చేసిన కృషికి జైపూర్‌లోని అమిటీ విశ్వవిద్యాలయం నుండి గౌరవ డాక్టరేట్‌ను అందుకుంది. ఇటీవల ముగిసిన రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో విద్యాధర్ నగర్ స్థానం నుంచి దియా కుమారి 71,368 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందారు.