Sunita Williams : ఆ గ్రామంతో సునీతా విలియమ్స్‌కి ఉన్న ప్రత్యేక అనుబంధం ఏమిటో తెలుసా?
ఈ వార్తాకథనం ఏంటి
భారత మూలాలు కలిగిన అమెరికన్ వ్యోమగామి సునీతా విలియమ్స్ తిరిగి భూమి మీదకు రానున్న వేళ.. ఆమె మూలాలను మర్చిపోకుండా తన గ్రామానికి చూపిస్తున్న ప్రేమ, అనురాగం మరోసారి చర్చనీయాంశమవుతోంది.
గతేడాది జూన్‌లో అంతరిక్షంలోకి వెళ్లిన సునితా విలియమ్స్.. అక్కడే 9 నెలలు చిక్కుకుపోయారు. ఇంతకాలం తర్వాత మరికొన్ని గంటల్లో భూమిపైకి రానున్నారు.
1965 సెప్టెంబర్ 19న అమెరికాలోని ఓహాయోలో జన్మించిన సునితా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యా గుజరాత్‌కు చెందినవారు. ఆయన 1957లో అమెరికాకు వలస వెళ్లి అక్కడే స్థిరపడ్డారు.
సునీతా తండ్రి స్వస్థలం గుజరాత్‌లోని ఝులసన్ అనే చిన్న గ్రామం. సుమారు 7 వేల మంది జనాభా కలిగిన ఈ గ్రామంలోని ప్రజలు సునీతా విజయాలను ఎంతో గర్వంగా చూసుకుంటారు.
Details
స్వగ్రామాన్ని మర్చిపోని సునీతా విలియమ్స్
తన మూలాలను ఎప్పుడూ మరిచిపోని సునితా విలియమ్స్.. ఇప్పటివరకు మూడు సార్లు ఝులసన్ గ్రామాన్ని సందర్శించారు. 1972, 2007, 2013లో ఆమె స్వగ్రామాన్ని చూసి వచ్చారు.
గ్రామంలోని స్కూల్‌కు విరాళాలు అందజేశారు. స్కూల్‌లోని ప్రార్థనా మందిరంలో సునీతా తాత-నానమ్మల ఫొటోలు ప్రతిష్ఠించారు.
9 నెలల తర్వాత భూమిపైకి సునీతా విలియమ్స్
2024 జూన్‌లో సునితా విలియమ్స్, బుచ్ విల్మోర్ బోయింగ్ స్టార్‌లైనర్ ద్వారా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లారు.
అయితే స్పేస్ క్రాఫ్ట్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వారు తిరిగి భూమికి రాలేకపోయారు. చివరికి స్పేస్ ఎక్స్ క్యాప్సూల్‌లో వారిని భూమికి తిరిగి రప్పించాలని నాసా
Details
ప్రత్యక్ష ప్రసారం ద్వారా ల్యాండింగ్ వీక్షణం
ఈ రోజు (మార్చి 18) స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 5:57 గంటలకు గల్ఫ్ ఆఫ్ మెక్సికో తీరం వద్ద సునీతా విలియమ్స్ భూమిపైకి దిగనున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఈ ల్యాండింగ్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించనున్నారు.
జులసన్ గ్రామస్తుల పూజలు
సునితా విలియమ్స్ 9 నెలలుగా అంతరిక్షంలో చిక్కుకుపోయారని తెలిసినప్పటి నుంచి ఝులసన్ గ్రామస్థులు రోజూ ఆమె కోసం ప్రార్థనలు చేస్తున్నారు.
గ్రామంలోని దేవాలయంలో దీపాలు వెలిగిస్తూ ఆమె భద్రంగా భూమికి చేరాలని మొక్కులు మొక్కారు.
Details
అంతరిక్షంలో సునీతా విలియమ్స్ ఘనతలివే
2007లో ఐఎస్‌ఎస్‌లో 195 రోజులు గడిపిన తొలి మహిళా వ్యోమగామి
స్పేస్‌వాక్‌లో 50 గంటల 40 నిమిషాలు గడిపిన ఘనత
మొత్తం ఏడుసార్లు స్పేస్‌వాక్ చేసి రికార్డు
ఐఎస్‌ఎస్‌లో రెండుసార్లు సేవలందించిన మహిళా వ్యోమగామిగా గుర్తింపు