Kerala: కేరళలో యువ వైద్యురాలు ఆత్మహత్య.. విచారణకు ప్రభుత్వం ఆదేశం
ఈ వార్తాకథనం ఏంటి
తిరువనంతపురం మెడికల్ కాలేజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చదువుతున్న షహానా డిసెంబర్ 4న తన అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, శస్త్రచికిత్స విభాగంలో పనిచేస్తున్న షహనా ఆత్మహత్య చేసుకొని మరణించిందన్నారు.
పీజీ డాక్టర్ అయిన తన స్నేహితుడుతో ఆమెతో పెళ్లి సందర్భంగా ఆమె కుటుంబాన్ని 50 సవర్ల బంగారం, రూ. 50 లక్షల విలువైన ఆస్తులు, కారు కట్నం క్రింద డిమాండ్ చేశారు. దానికి షహనా కుటుంబం కూడా ఓకే చెప్పారు.
అయితే, కాబోయే వరుడు, కుటుంబ సభ్యులు మరింత కట్నం కోసం డిమాండ్ చేయడంతో షహానా ఆత్మహత్యకు చేసుకుందని ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.
Details
కేసు నమోదు చేసిన రాష్ట్ర మైనారిటీ కమిషన్
మిడిల్ ఈస్ట్‌లో ఉద్యోగం చేస్తున్న బాధితురాలి తండ్రి ఇటీవల మరణించాడు. వారి ఆర్ధిక స్థితి కూడా అంతంత మాత్రంగానే ఉంది.
మెడికల్ కాలేజీ పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేశారు.
షహానా తల్లిని ఆమె ఇంటికి వెళ్లి పరామర్శించిన కేరళ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ అడ్వకేట్ సతీదేవి.. ఈ అంశంపై సరైన విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
మహిళా కమిషన్ పోలీసుల నుంచి నివేదిక కోరనుంది.
అబ్బాయి కుటుంబం వరకట్నం డిమాండ్ చేస్తే వారిపై వరకట్న నిరోధక చట్టం కింద కేసు నమోదు చేస్తామని సతీదేవి తెలిపారు.
దీనికి సంబంధించి మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా రాష్ట్ర మైనారిటీ కమిషన్ కూడా స్వయంగా కేసు నమోదు చేసింది.
Details
షహనా ఆత్మహత్యపై విచారణకు ఆదేశించిన ప్రభుతం
మరోవైపు, మెడికల్ పీజీ డాక్టర్స్ అసోసియేషన్ తమ సంస్థలోని అన్ని బాధ్యతల నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్‌ను తొలగించింది.
షహనా ఆత్మహత్యపై విచారణ జరిపి నివేదిక సమర్పించాలని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ బుధవారం మహిళా శిశు అభివృద్ధి శాఖను ఆదేశించారు.