NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు
    సంక్షిప్తం చేయు
    తదుపరి వార్తా కథనం
    Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు
    మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు

    Momos: మోమోస్ తయారీలో కుక్క మాంసం కల్తీ?.. పోలీసుల కేసు నమోదు

    వ్రాసిన వారు Jayachandra Akuri
    Mar 18, 2025
    04:02 pm

    ఈ వార్తాకథనం ఏంటి

    బయట ఆహారాలకు ఆసక్తి చూపే వారు చాలామంది ఉన్నా అవి ఎక్కడ, ఎలా తయారవుతాయో ఎప్పుడైనా ఆలోచించారా? "మేకింగ్ ఎందుకు? ఈటింగ్ మాత్రమే మాకు కావాలి!" అనుకునే వారికి ఈ ఘటన షాక్ తగిలించేంత భయంకరంగా మారింది.

    పంజాబ్ రాష్ట్రంలోని మొహాలీ జిల్లా మాటౌర్ గ్రామంలో అక్రమంగా నడుస్తున్న మోమో, స్ప్రింగ్ రోల్ తయారీ యూనిట్‌పై మున్సిపల్ కార్పొరేషన్ వైద్య బృందం దాడి చేసింది.

    ఈ దాడుల్లో ఫ్రీజర్‌లో కుక్క తల, కుళ్లిపోయిన కూరగాయలు, అపరిశుభ్రమైన వాతావరణంలో నిల్వ ఉంచిన మాంసం లభ్యమైంది

    . మోమోలు తయారు చేసే ప్రదేశం అసహ్యకరమైన స్థితిలో ఉండటంతో, అధికారులు విస్తుపోయారు. ఫ్రీజ్‌లో ఉన్న మాంసం ఏ జంతువిదో తెలుసుకునేందుకు అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

    Details

    ల్యాట్ టెస్టింగ్ కు మాంసం

    అసిస్టెంట్ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ డాక్టర్ అమృత్ వారింగ్ మాట్లాడుతూ మోమోస్ తయారీ యూనిట్‌పై దాడి నిర్వహించాం. ఫ్యాక్టరీ ఫ్రీజ్‌లో కుక్క తల బయటపడింది.

    ఫ్యాక్టరీ నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు పోలీసులకు సమాచారం అందించాం.

    అయితే, మోమోల తయారీలో ఈ మాంసాన్ని ఉపయోగించలేదని, తాము తింటామని ఫ్యాక్టరీ కార్మికులు చెప్పడం గమనార్హం.

    మోమోస్, స్ప్రింగ్ రోల్స్‌తో పాటు చట్నీ నమూనాలను కూడా ల్యాబ్ టెస్టింగ్‌కు పంపించామన్నారు.

    Details

    ఫ్రిజ్ లో కుళ్లిన మాంసం

    ఫ్రీజ్‌లో కుప్పలు కుప్పలుగా కుళ్లిపోయిన మాంసం నిల్వ ఉన్నట్లు గుర్తించాం" అని తెలిపారు. ఈ యూనిట్‌ను నడుపుతున్న విక్రేతలు నేపాల్‌కు చెందినవారని సమాచారం.

    మొహాలి సివిల్ సర్జన్ డాక్టర్ సంగీత జైనా ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోందని తెలిపారు.

    అక్రమంగా మాంసాన్ని నిల్వ ఉంచడమే కాకుండా, దాన్ని వినియోగిస్తున్నారా లేదా అనే అంశంపై పూర్తి పరిశీలన జరుగుతోంది.

    ప్రస్తుతం పరీక్షల కోసం మోమోస్, స్ప్రింగ్ రోల్స్ నమూనాలను ల్యాబ్‌కు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఈ సంఘటన బయటకొచ్చిన తర్వాత బయట ఫుడ్ తినడంపై ప్రజల్లో భయం నెలకొంది.

    ట్విట్టర్ పోస్ట్ చేయండి

    వైరల్ అయిన వీడియో ఇదే

    If you eat Momos and Spring Rolls from street food vendors in Mohali, make sure to watch this video! Visuals from Mataur, Mohali, show locals raiding a place where momos and spring rolls were being prepared. These items were being supplied to various fast food stalls across… pic.twitter.com/r5nnGgymSj

    — Gagandeep Singh (@Gagan4344) March 16, 2025
    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    పంజాబ్
    ఇండియా

    తాజా

    Amritsar: 'భయపడాల్సిన అవసరం లేదు': అమృతసర్​ లో మళ్లీ మోగిన సైరన్.. ఇళ్లలోనుంచి బయటకు రావద్దని హెచ్చరికలు అమృత్‌సర్
    Operation Sindoor: చండీగఢ్‌లోని వైమానిక దళ స్థావరంపై డ్రోన్ దాడి బెదిరింపు,మ్రోగిన సైరన్ ఆపరేషన్‌ సిందూర్‌
    Operation Sindoor: గుజరాత్‌ పోర్ట్‌పై దాడి..? నకిలీ వీడియో అంటూ ఖండించిన పీఐబీ గుజరాత్
    Exams: భారత్-పాకిస్తాన్ యుద్ధం నేపథ్యంలో .. నేటి నుంచి జరగాల్సిన పరీక్షలు రద్దు పరీక్షలు

    పంజాబ్

    Lok Sabha Elections: 5 రాష్ట్రాల్లో ఆప్- కాంగ్రెస్ కుదిరిన పొత్తు  ఆమ్ ఆద్మీ పార్టీ/ఆప్
    Goods train: రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం.. డ్రైవర్ లేకుండానే 84 కిమీ నడిచిన రైలు జమ్ముకశ్మీర్
    Bunty Bains : ప్రముఖ పంజాబీ గీత రచయిత బంటీ బెయిన్స్‌పై హత్యాయత్నం తాజా వార్తలు
    Punjab: పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ నేతను కాల్చి చంపిన దుండగులు హత్య

    ఇండియా

    ICC: భారత్ vs పాక్ మ్యాచ్‌కు ముందు కొత్త వివాదం.. ఐసీసీకి పీసీబీ ఫిర్యాదు! ఐసీసీ
    UGC NET Results out: యూజీసీ-నెట్ ఫలితాలు విడుదల - అర్హత సాధించిన అభ్యర్థుల సంఖ్య ఎంతో తెలుసా? భారతదేశం
    PM Modi: ఏఐతో భారత్ పురోగతి: మన్‌కీ బాత్‌లో ప్రధాని మోదీ నరేంద్ర మోదీ
    Nehru Zoo Park Ticket Price: పర్యాటకులకు బిగ్ షాక్‌.. హైదరాబాద్ జూపార్క్‌లో టికెట్, పార్కింగ్ ఛార్జీల పెంపు హైదరాబాద్
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025