Pariksha Pe Charcha : పరీక్షలంటే భయపడొద్దు.. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లండి.. విద్యార్థులతో ప్రధాని మోదీ
ఈ వార్తాకథనం ఏంటి
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతేడాది విద్యార్థుల్లో పరీక్షల భయాన్ని తొలగించేందుకు 'పరీక్షా పే చర్చ' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది కూడా '8వ ఎడిషన్'ను ఘనంగా నిర్వహించారు. న్యూదిల్లీలోని సుందర్ నర్సరీలో జరిగిన ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు.
సాధారణంగా ఈ కార్యక్రమాన్ని భారత్ మండపంలో నిర్వహించేవారు. కానీ, ఈసారి ప్రత్యేకంగా 36 మంది విద్యార్థులను సుందర్ నర్సరీకి తీసుకెళ్లి వారితో ప్రత్యక్షంగా సంభాషించారు.
Details
కీలక సూచలిచ్చిన మోదీ
పరీక్షల్లో ఒత్తిడిని ఎదుర్కోవడం, మానసిక స్థైర్యాన్ని కాపాడుకోవడం సహా పలు సమస్యలపై ప్రధాన మంత్రి పలు కీలక సూచనలు తెలియజేశారు.
విద్యార్థులకు పరీక్షలు జీవితంలో అత్యంత ముఖ్యమైనవిగా కాకుండా, సమతుల్యతతో చదువుపై దృష్టి సారించాలని సూచించారు.
అలాగే తన పాఠశాల రోజుల అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు.
విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన వీడియోను ప్రధాని మోదీ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా షేర్ చేశారు.