VC Sajjanar: స్వార్థపూరిత ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మొద్దు
ఈ వార్తాకథనం ఏంటి
బెట్టింగ్ యాప్‌లు అనేక ప్రాణాలను బలి తీసుకుంటున్నాయని టీజీఆర్టీసీ ఎండీ, ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ అన్నారు.
డబ్బులు కోసం సోషల్ మీడియాలో ఇలాంటి ప్రచారాలు చేయకూడదని ఇన్‌ఫ్లుయెన్సర్లను ఆయన కోరారు. రాత్రికి రాత్రే కోటీశ్వరులు కావాలని ఆశపడటం ప్రమాదకరమని సజ్జనార్ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇన్‌ఫ్లుయెన్సర్లు సోషల్ మీడియాలో విడుదల చేసే వీడియోలు అమాయకులను ఆన్‌లైన్ బెట్టింగ్ మహమ్మారికి బానిసలు చేస్తున్నాయన్నారు.
ప్రజా ప్రయోజనాలను పక్కన పెట్టి స్వలాభం కోసం చేస్తున్న ఈ చర్యలు సమాజానికి హాని కలిగిస్తాయన్నారు.
Details
ఆన్‌లైన్ బెట్టింగ్ మాయ పడొద్దు
కష్టపడకుండానే కాసులు సంపాదించాలన్న ఆలోచన యువతకు మంచిది కాదని గుర్తించుకోవాలన్నారు.
స్వార్థపూరిత ఆలోచనలను అనుసరించే ఇన్‌ఫ్లుయెన్సర్ల మాటలను నమ్మి, ఆన్‌లైన్ బెట్టింగ్ మాయలో పడకూడదన్నారు.
సమాజానికి వ్యతిరేకంగా పని చేసే ఈ శక్తులకు దూరంగా ఉండండి అంటూ హెచ్చరించారు.