తదుపరి వార్తా కథనం
Hyderabad : నార్సింగి గుట్టపై జంట హత్యలు.. దర్యాప్తు సాగిస్తున్న పోలీసులు
వ్రాసిన వారు
Jayachandra Akuri
Jan 14, 2025
03:53 pm
ఈ వార్తాకథనం ఏంటి
నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాద ఘటన చోటు చేసుకుంది.
ఓ జంటను గుర్తు తెలియని దుండగులు కత్తులతో పొడిచి దారుణంగా హతమార్చిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన పుప్పాలగూడలోని అనంతపద్మనాభ స్వామి ఆలయ సమీపంలోని గుట్టపై జరిగింది.
అక్కడ కొంతమంది పతంగులు ఎగురవేయడానికి వెళ్ళిన సమయంలో వారు మృతదేహాలను గుర్తించారు. స్థానికులు సంఘటనను గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రాజేంద్రనగర్ డీసీపీ శ్రీనివాస్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు.
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇంకా ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.