Voter ID Card : క్షణాల్లో ఓటరు కార్డుని డౌన్‌లోడ్ చేసుకోండిలా..!
ఓటర్లకు ఎన్నికల సంఘం (Election Commission) శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఇంటి వద్ద నుంచే ఆన్ లైన్‌లో ఓటర్ కార్డు (Voter Card)ను పొందేందుకు అవకాశం కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో క్షణాల్లో ఓటరు కార్డును ఆన్ లైన్ ద్వారా డిజిటల్ ఓటరు కార్డును పొందే వెసులుబాటును కల్పించారు. దీని కోసం వైబ్ సైట్‌లో ఎన్నికల సంఘం కీలక మార్పులను చేసింది. ఈ విధానంతో మొబైల్ నంబరు నమోదుతో క్షణాలలో ఈ-ఓటరు గుర్తింపు కార్డును పొందవచ్చని, ముఖ్యంగా ఓటు హక్కును వినియోగించేందుకు కూడా ఇది చెల్లుబాటు అవుతుందని కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టం చేసింది. ఇక ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం రూపొందించిన ఫాం-8నే ఇందుకోసం ఉపయోగించాల్సి ఉంటుంది.
డిజిటల్ ఓటర్ కార్డును డౌన్ లోడ్ చేసుకొనే విధానం
1. ఓటరు ఐడీ కార్డును పొందడానికి ముందుగా నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ http://voters. eci.gov.in లాగిన్ చేయాలి. 2.హోమ్ పేజీలోని E-Epic డౌన్‌లోడ్ ఆప్షన్‌ను నొక్కాలి. 3. ఇందులో రిజిస్టర్ మొబైల్ లేదా ఈమెయిల్ ఐడీ లేదా Epic నెంబర్ వంటి సమాచారం ఇచ్చి క్యాప్యాతో కూడి రిక్వెస్ట్ ఓటిపీ ని నొక్కాలి. 4.మీ రిజిస్టర్ మొబైల్ ద్వారా అందుకున్న ఓటీపీ ఎంటర్ చేయాలి. 5. ఇప్పుడు డిజిల్ ఓటరు ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవడానికి మీరు eEPIC పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం ద్వారా PDF ఫార్మాట్‌లో మీ డిజిటల్ ఓటర్ ఐడీ కార్డును డౌన్ లోడ్ చేసుకోవచ్చు.