
Kolkatta: కోల్‌కతాలో డ్రోన్ల కలకలం.. విచారణ చేపట్టిన పోలీసులు
ఈ వార్తాకథనం ఏంటి
పహల్గాం ఉగ్రదాడి సంఘటన దేశవ్యాప్తంగా భద్రతా సంస్థలను అప్రమత్తం చేసింది.
దీనిపై కేంద్రం అన్ని రాష్ట్రాల్లో భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.ఈ నేపథ్యంలో కోల్‌కతా నగరంలో సోమవారం ఒక కీలక పరిణామం చోటుచేసుకుంది.
రాత్రి 8 గంటల నుంచి 10 గంటల మధ్య నగర గగనతలంలో అనుమానాస్పద డ్రోన్లు సంచరిస్తుండటంతో భద్రతా యంత్రాంగం హైఅలర్ట్‌కి వెళ్లింది.
ఆ డ్రోన్లను హేస్టింగ్స్,విద్యాసాగర్ బ్రిడ్జ్,ఫోర్ట్ విలియం,పార్క్ సర్కస్ వంటి ప్రముఖ ప్రాంతాల్లో తొలుత గుర్తించారు.
ఈ పరిస్థితిని అత్యంత తీవ్రమైనదిగా పరిగణించిన కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ (STF)తో పాటు డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్ ఈ ఘటనపై విచారణ ప్రారంభించాయి.
డ్రోన్లను ఎవరెవరు ఎగురవేశారు?విదేశాలకు చెందిన గూఢచారి చర్యలతో సంబంధం ఉందా? అనే కోణాల్లో విచారణ సాగుతోంది.
వివరాలు
మహేష్తలా ప్రాంతం వైపు నుంచి డ్రోన్లు
ఈ సందర్భంగా ఒక పోలీసు అధికారి మాట్లాడుతూ.. హేస్టింగ్స్ పోలీస్ స్టేషన్ సిబ్బంది రాత్రివేళ డ్రోన్ల సంచారణను గమనించారని వెల్లడించారు.
పారగణాల జిల్లా పరిధిలోని మహేష్తలా ప్రాంతం వైపు నుంచి డ్రోన్లు నగరంలోకి ప్రవేశించినట్లుగా గుర్తించామని చెప్పారు.
అవి పార్క్ సర్కస్ ప్రాంతానికి చేరుకున్న వెంటనే కనిపించకుండా పోయినట్లు సమాచారం ఉందని తెలిపారు.
ఈ ఘటనపై అన్ని కోణాల్లో లోతుగా దర్యాప్తు చేపడుతున్నామని, నగర భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేదని కోల్‌కతా స్పెషల్ టాస్క్ ఫోర్స్ స్పష్టం చేసింది.