Kalvakuntla Kavitha: కల్వకుంట్ల కవిత నివాసంపై డ్రోన్ కలకలం.. పోలీసు శాఖదేనని స్పష్టత
ఈ వార్తాకథనం ఏంటి
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నివాసంపై డ్రోన్ ఎగరడం మంగళవారం కలకలం రేపింది. రోడ్డు నంబర్ 14లో ఉన్న ఆమె ఇంటిపై సాయంత్రం సమయంలో డ్రోన్ అటూ ఇటూ తిరగడాన్ని అక్కడి వారు గమనించారు. ఆ సమయంలో కవిత ఇంట్లోనే ఉండటంతో భద్రతా సిబ్బంది అప్రమత్తమయ్యారు. డ్రోన్ కనిపించడంతో అక్కడున్న పార్టీ శ్రేణులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం సాయంత్రం 5.45 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనిపై కవిత కార్యాలయ సిబ్బంది బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై బంజారాహిల్స్ ఇన్‌స్పెక్టర్ ఎస్. సుహాసన్ స్పందించారు. ఆ డ్రోన్ పోలీసు శాఖకు చెందిన అధికారిక డ్రోన్ అని స్పష్టం చేశారు.
వివరాలు
ప్రముఖుల భద్రత, బందోబస్తు ఏర్పాట్లు
బంజారాహిల్స్ ప్రాంతంలో ప్రముఖుల భద్రత, బందోబస్తు ఏర్పాట్లు, ఇతర రూట్‌మ్యాప్ వివరాలను పరిశీలించేందుకు పోలీసులు ఈ డ్రోన్‌ను వినియోగిస్తున్నట్లు తెలిపారు.
పోలీసు శాఖ పర్యవేక్షణలోనే డ్రోన్ ఎగురుతోందని, ఈ క్రమంలో అది కవిత నివాసం మీదుగా వెళ్లడంతో అక్కడివారు ఆందోళనకు గురై ఉండవచ్చని ఇన్‌స్పెక్టర్ వివరించారు.