Page Loader
Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం
దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

Cocaine Seized: దిల్లీలో కలకలం రేపిన డ్రగ్స్.. రూ.2వేల కోట్ల విలువైన కొకైన్ స్వాధీనం

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2024
03:37 pm

ఈ వార్తాకథనం ఏంటి

దేశ రాజధాని దిల్లీలో అంతర్జాతీయ డ్రగ్‌ స్మగ్లింగ్‌ ముఠా గుట్టురట్టైంది. సౌత్‌ దిల్లీలో జరిగిన దాడుల్లో దిల్లీ పోలీసులు 500 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. మార్కెట్‌లో ఈ డ్రగ్స్‌ విలువ సుమారు రూ. 2,000 కోట్లకు పైగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. స్పెషల్‌ సెల్‌ ఆధ్వర్యంలో స్మగ్లర్లను అరెస్టు చేశారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని, విచారణ చేపట్టారు. స్మగ్లింగ్‌ సమాచారం మేరకు స్పెషల్‌ టీం నిందితులను పట్టుకుని, వారి నుంచి 560 కిలోల కొకైన్‌ను స్వాధీనం చేసుకుంది.

Details

 భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు 

ఈ నిందితులంతా ఒక అంతర్జాతీయ డ్రగ్ ముఠాకు చెందినవారని తేలింది. ఈ ముఠా ఇండియాలో భారీ స్థాయిలో మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల దిల్లీలోని తిలక్‌ నగర్‌ ప్రాంతంలో జరిగిన ఆపరేషన్‌లో 400 గ్రాముల హెరాయిన్, 160 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో ఇద్దరు ఆఫ్గాన్‌ పౌరులను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.