
Hyderabad Drunk And Drive : కొత్త సంవత్సరం సందర్భంగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఎన్నంటే!
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ రాజధాని హైదరాబాద్ మహానగరంలో కొత్త సంవత్సర వేడుకలు ఆకాశాన్నంటాయి. కుటుంబాలతో కలిసి కొత్త ఏడాది వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు.
ఇదే సమయంలో యువత ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు హోటళ్లు, పబ్‌లు, రిసార్టులు మిరుమిట్లు గొలిపేలా ఈవెంట్లు నిర్వహించాయి.
ఈ మేరకు అర్ధరాత్రి దాటేదాక రోడ్లపై తిరుగుతూ, టాపాసులు కాలుస్తూ సూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు.
దీంతో పోలీసులు రంగప్రవేశం చేశారు.ఈ క్రమంలోనే ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ (Drunk And Drive) తనిఖీలతో హడలెత్తించి మందుబాబులకు ఝలక్ ఇచ్చారు.
హైదరాబాద్, సైబరాబాద్ కమిషనరేట్లలో కలిసి దాదాపుగా 2700కుపైగా డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను నమోదు చేశారు.
details
రాత్రి 8గంటలకే క్లోజ్
ఇందులో హైదరాబాద్ పరిధిలోనే అత్యధికంగా 1500లకుపైగా కేసులు నమోదయ్యాయి. ఇక సైబరాబాద్‌లో 1241 కేసులు రిజిస్టర్ అయ్యాయి.
మరోవైపు సైబరాబాద్ పరిధిలో ఇద్దరు మహిళలతో పాటు తాగి వాహనాలు నడిపి పట్టుబడిన 1239 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేసిన కేసుల్లో 938 బైకులు, 21 ఆటోలు, 275 కార్లు, 7 భారీ వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా పోలీసులతో వాహనదారులు పలు ప్రాంతాల్లో వాగ్వాదానికి సైతం దిగగా వారిపైనా కేసు పెట్టారు.
జంటనగరాల్లో అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. నగరంలోని ఫ్లైఓవర్లు, ఓఆర్‌ఆర్‌ను ఆదివారం రాత్రి 8గంటలకే మూసేశారు.
పీవీ ఎక్స్‌ప్రెస్ వేపై విమానం టిక్కెట్ ఉన్నవారికే అనుమతించారు.