Lorry driver: తాగి రైలు పట్టాలపై లారీని నిలిపిన డ్రైవర్.. తర్వాత ఏమైందంటే?
ఈ వార్తాకథనం ఏంటి
మద్యం మత్తులో ఓ లారీ డ్రైవర్ విచిత్రమైన ఘటనకు పాల్పడ్డాడు. రైలు పట్టాలపై లారీ నడిపాడు.
ఆ లారీ రైలు పట్టాల వద్ద చిక్కుకుపోవడంతో అక్కడి నుంచి ఆ డ్రైవర్ పరారయ్యాడు.
ఈ ఘటన పంజాబ్ (Punjab) లోని లుథియానాలో చోటు చేసుకుంది.
ఇంతలో మరో ట్రాక్ ఫై వస్తున్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ లోకో పైలట్ పట్టాలపై లారీ ఉండటాన్ని గమనించాడు.
వెంటనే ఎమర్జెన్సీ బ్రేకులు వేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.
Details
ఆలస్యంగా స్టేషన్ కు చేరుకున్న గోల్డెన్ టెంపుల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్
శుక్రవారం రాత్రి మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ షేర్పూర్ ప్లై ఓవర్ సమీపంలోని రైల్వే ట్రాక్ పైకి ఈ లారీని నిలపడంతో ఈ ఘటన చోటు చేసుకుంది.
అయితే ఈ సంఘటనలో రైలు లారీని కొద్దిగా తాకి ఆగిపోయింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు.
ఈ ఘటనతో గోల్డెన్ టెంపుల్ ఎక్స్ ప్రెస్ ట్రైన్ లూథియానా స్టేషన్ కు అరగంట ఆలస్యంగా చేరుకోవాల్సి వచ్చింది.
తర్వాత ఆ ప్రాంతానికి పోలీసులు చేరుకొని ట్రాఫిక్ ను క్లియర్ చేశారు. ప్రస్తుతానికి లారీ పోలీసుల ఆధీనంలో ఉంది.