DSC Notification: గుడ్ న్యూస్.. రెండు రోజుల్లో తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్
ఈ వార్తాకథనం ఏంటి
తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల్లో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని ఆమె స్పష్టం చేశారు. బషీర్ బాగ్‌లో గురువారం మంత్రి సబితా మీడియాతో మాట్లాడారు. మొత్తం 6500 పైగా పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
పాఠాశాల విద్యలో 5,089 పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 పోస్టుల భర్తీ చేయనున్నట్లు వెల్లడించారు.
విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి, ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని వివరించారు.
Details
డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ
కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, త్వరలోనే డీఎస్పీ పరీక్షను కూడా నిర్వహించనున్నట్లు మంత్రి సబితా చెప్పారు.
కాంట్రాక్టు ఉద్యోగులకు ఇప్పటికే క్రమబద్ధీకరించామని, ఇంటర్, డిగ్రీ స్థాయిలో 3140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. మిగిలిన ఖాళీలను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు.
టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారా పోస్టుల భర్తీ చేస్తామన్నారు. డీఎస్సీ నోటిఫికేషన్ ప్రకటన తెలంగాణ నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.