
Kotha Prabhakar Reddy: దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో దాడి
ఈ వార్తాకథనం ఏంటి
ఎన్నికల ప్రచారంలో ఉన్న దుబ్బాక ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి ఇవాళ హత్యయత్నం జరిగింది.
ఓ యువకుడు ఎంపీపై కత్తితో కడుపులో పొడిచి గాయపర్చాడు. దౌలతాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది.
రాజు అనే యువకుడు దాడి చేసినట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే గమనించిన బీఆర్ఎస్ కార్యకర్తలు ఆ యువకుడ్ని చావబాది పోలీసులకు అప్పగించారు.
కడుపు భాగంలో ఎంపీకి తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గజ్వేల్ ఆస్పత్రికి తరలించారు. ఇక నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
ఎంపీని ఆస్పత్రికి తరలిస్తున్న బీఆర్ఎస్ కార్యకర్తలు
#Telangana: Knife attack on #BRS Medak MP and Dubbaka MLA candidate Kotha Prabhakar. Man named Raju allegedly attacked the MP with a knife in Surampalli village, Doultabad mandal, Siddipet. MP shifted to Gajwel with serious injuries. Raju got beaten up. #TelanganaElection2023 pic.twitter.com/CArJAHuA7m
— Krishnamurthy (@krishna0302) October 30, 2023