
Delhi airport: దిల్లీ విమానాశ్రయంలో 20 విమానాలు దారి మళ్లింపు.. కారణం ఇదే..
ఈ వార్తాకథనం ఏంటి
దిల్లీ విమానాశ్రయంలో శనివారం ఉదయం దాదాపు 20 విమానాలను దారి మళ్లించినట్లు ఎయిర్ పోర్టు వర్గాలు తెలిపాయి.
ప్రతికూల వాతావరణం కారణమని వెల్లడించాయి. విమానాలను జైపూర్, అమృత్‌సర్, లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్‌లకు మళ్లించినట్లు ఒక అధికారి తెలిపారు.
ఉదయం 7:30 గంటల నుంచి 10:30 గంటల మధ్య విమానాలా దారిమళ్లించినట్లు వెల్లడించారు.
మొత్తం 13 విమానాలను జైపూర్‌కు, నాలుగు విమానాలను అమృత్‌సర్‌కు లక్నో, అహ్మదాబాద్, చండీగఢ్‌లకు ఒకటి చొప్పున మళ్లించినట్లు పేర్కొన్నారు.
ఉదయం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తక్కువ విజిబిలిటీ విధానాలు అమలులో ఉన్నాయని దిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం ట్విట్టర్ (ఎక్స్)లో పోస్ట్ చేసింది.
ట్విట్టర్ పోస్ట్ చేయండి
దిల్లీ ఎయిర్ పోర్టు చేసిన ట్వీట్
Update issued at 0808 Hours
— Delhi Airport (@DelhiAirport) December 2, 2023
Kind attention to all flyers!#Fog #FogAlert #DelhiAirport pic.twitter.com/gES7foK5qh