NewsBytes Telugu
    English Hindi Tamil
    మరింత
    English Hindi Tamil
    NewsBytes Telugu
    భారతదేశం
    బిజినెస్
    అంతర్జాతీయం
    క్రీడలు
    టెక్నాలజీ
    సినిమా
    ఆటోమొబైల్స్
    లైఫ్-స్టైల్
    కథనాలు

    మమ్మల్ని అనుసరించండి
    • Facebook
    • Twitter
    • Linkedin
    హోమ్ / వార్తలు / భారతదేశం వార్తలు / Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర 
    తదుపరి వార్తా కథనం
    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర 
    ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర

    Kedarnath Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు; నిలిచిపోయిన కేదార్‌నాథ్ యాత్ర 

    వ్రాసిన వారు Stalin
    Jul 12, 2023
    11:05 am

    ఈ వార్తాకథనం ఏంటి

    భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉత్తరాఖండ్‌లోని సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్‌లలో కేదార్‌నాథ్ యాత్రను నిలిపివేసినట్లు అధికారులు బుధవారం తెలిపారు.

    ప్రతికూల వాతావరణం కారణంగా ప్రయాణీకుల భద్రత దృష్ట్యా, జిల్లా యంత్రాంగం సోన్‌ప్రయాగ్, గౌరీకుండ్ వద్ద ప్రయాణికులను నిలిపివేసింది.

    వర్షం కారణంగా నాలుగు రాష్ట్ర రహదారులు, 10 లింక్ రోడ్లు దెబ్బతిన్నాయి. అలాగే మందాకిని, అలకనంద నదులు ఉప్పొంగుతున్నాయని అధికారులు తెలిపారు.

    ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల నేపథ్యంలో ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ కూడా జారీ చేసింది.

    ఉత్తరాఖండ్

    అప్రమత్తంగా ఉన్నాం: ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి 

    ఉత్తరాఖండ్‌తో పాటు పశ్చిమ ఉత్తర్‌ప్రదేశ్ పరిసర ప్రాంతాల్లో జూలై 12న భారీ నుంచి అతి భారీ వర్షపాతం (115.6 నుంచి 204.4 మి.మీ) నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

    ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో రాష్ట్ర పరిపాలన యంత్రాంగం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉందని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తెలిపారు.

    ప్రతి ఏడాది రాష్ట్రంలో వర్షాకాలంలో ప్రకృతి వైపరీత్యాలను ఎదుర్కోవాల్సి వస్తుందని, అధిక వర్షపాతం వల్ల కొండచరియలు విరిగిపడటం, నదుల నీటిమట్టం పెరుగుతాయని అందుకు తాము సన్నద్ధంగా ఉన్నామని చెప్పారు.

    ఉత్తరాఖండ్‌లోని గంగ్నాని సమీపంలో గంగోత్రి జాతీయ రహదారిపై మంగళవారం కొండచరియలు విరిగిపడి నలుగురు మరణించారు. మరియు 10 మంది గాయపడ్డారు.

    Facebook
    Whatsapp
    Twitter
    Linkedin
    సంబంధిత వార్తలు
    తాజా
    భారీ వర్షాలు
    ఉత్తరాఖండ్
    తాజా వార్తలు

    తాజా

    Kiran Abbavaram : కిరణ్ అబ్బవరం కొత్త సినిమా గ్లింప్స్ రిలీజ్.. కిరణ్ అబ్బవరం
    Rajamouli: గెలుపు ఎవరిదైనా.. ఓటమి గుండెల్లో నిలిచిపోతుంది.. రాజమౌళి ట్వీట్ వైరల్ రాజమౌళి
    PM Modi: జూన్ 04న మంత్రులతో ప్రధాని మోదీ భేటీ.. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఇదే మొదటి సమావేశం.. నరేంద్ర మోదీ
    IPL Prize Money: ఐపీఎల్ ఫైనల్ గెలిచిన జట్టుకు భారీగా నగదు.. ఆరెంజ్, పర్పుల్ క్యాప్ హోల్డర్లకు ఎంత తెలుసా? ఐపీఎల్

    భారీ వర్షాలు

    దిల్లీకి వరద ముప్పు; 207 మీటర్లు దాటిన యమునా నది నీటి మట్టం  దిల్లీ

    ఉత్తరాఖండ్

    50వేల మందిని రాత్రికిరాత్రి బలవంతంగా ఖాళీ చేయించలేం: సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు
    డేంజర్ జోన్‌లో జోషిమఠ్.. 678 భవనాలకు పగుళ్లు భారతదేశం
    జోషిమఠ్‌ సంక్షోభం: 'హిమాలయాల్లో చాలా పట్టణాలు మునిగిపోతాయ్'.. నిపుణుల హెచ్చరిక భారతదేశం
    ISRO: జోషిమఠ్‌ పట్టణంలో 12రోజుల్లో 5.4 సెం.మీ కుంగిన భూమి జోషిమఠ్

    తాజా వార్తలు

    లాస్ ఏంజిల్స్: ప్రైవేట్ జెట్ క్రాష్, ఆరుగురు మృతి అమెరికా
    స్మార్ట్‌ఫోన్ కొంటే, 2కిలోల టమాటాలు ఉచితం; ఆ మొబైల్ షాప్ ఎక్కడ ఉందంటే! స్మార్ట్ ఫోన్
    ఉత్తర భారతాన్ని ముంచెత్తుతున్న వానలు; హిమాచల్‌లో ఐదుగురు మృతి; దిల్లీలో 41ఏళ్ల రికార్డు బద్దలు  దిల్లీ
    రిలయన్స్‌ వ్యాపారంలో ముఖేష్ అంబానీ కుమార్తె ఇషా అంబానీ కొత్త రోల్  ముకేష్ అంబానీ
    మా గురించి గోప్యతా విధానం నిబంధనలు & షరతులు మమ్మల్ని సంప్రదించండి నైతిక ప్రవర్తన ఫిర్యాదుల పరిష్కారం వార్తలు న్యూస్ ఆర్కైవ్ టాపిక్స్ ఆర్కైవ్స్
    మమ్మల్ని అనుసరించండి
    Facebook Twitter Linkedin
    All rights reserved © NewsBytes 2025