LOADING...
Kurnool: రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు
రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు

Kurnool: రూ.782 కోట్ల బకాయిలు.. వేలానికి బుట్టా రేణుక దంపతుల ఆస్తులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 21, 2026
09:27 am

ఈ వార్తాకథనం ఏంటి

కర్నూలుకు చెందిన వైసీపీ మాజీ ఎంపీ బుట్టా రేణుక, ఆమె భర్త నీలకంఠ శివకు చెందిన ఆస్తులను వేలం వేయాలని ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ నిర్ణయించింది. గతంలో ఎల్‌ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ నుంచి ఈ దంపతులు సుమారు రూ.340 కోట్ల రుణం పొందారు. ప్రారంభంలో కొంతకాలం వాయిదాలు చెల్లించినప్పటికీ, అనంతరం చెల్లింపులు నిలిపివేశారు. దీంతో వడ్డీలు, ఇతర చార్జీలతో కలిపి బకాయి మొత్తం రూ.782.07 కోట్లకు పెరిగింది. సంస్థ తరఫున పలుమార్లు నోటీసులు జారీ చేసినా, ఇరువర్గాల మధ్య ఎలాంటి ప్రత్యామ్నాయ ఒప్పందం కుదరలేదు. ఈ పరిస్థితుల్లో వారు తనఖా పెట్టిన ఆస్తులను వేలం వేయాలని సంస్థ నిర్ణయించి, ప్రక్రియను ప్రారంభించింది.

Details

శుక్రవారం అధికారిక ప్రకటన

తాజాగా హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీ, సర్వే నంబరు 1009, ఫేజ్‌-6లో ఉన్న 3,833.28 చదరపు గజాల స్థలాన్ని వేలం వేయనున్నట్లు ఎల్‌ఐసీ హెచ్‌ఎఫ్‌ఎల్‌ బెంగళూరు బ్రాంచి శుక్రవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఆ స్థలంలో మెరిడియన్‌ పాఠశాల భవనం కూడా భాగంగా ఉంది. ఆస్తి విలువను రూ.65 కోట్లుగా నిర్ణయించారు. ఈ-బిడ్‌ దరఖాస్తులను ఈ ఏడాది మార్చి 23 వరకు స్వీకరిస్తామని, మార్చి 24న ఈ-వేలం నిర్వహించనున్నట్లు సంస్థ స్పష్టం చేసింది.

Advertisement