Page Loader
Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌ల‌తో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్ 
కేరళ విద్యార్థుల ర్యాగింగ్.. ఆ కేసులో అయిదుగురు విద్యార్థులు అరెస్టు

Kerala college ragging horror: ప్రైవేట్ భాగాలపై డంబెల్స్.. కంపాస్‌ల‌తో గుచ్చి.. 3 నెలలు కొట్టి.. కేరళ విద్యార్థుల ర్యాగింగ్ 

వ్రాసిన వారు Sirish Praharaju
Feb 12, 2025
01:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

కొట్టాయం ప్రభుత్వ నర్సింగ్ కాలేజీలో ర్యాగింగ్‌కి పాల్పడ్డ ఆరోపణలపై గాంధీనగర్ పోలీసులు ఐదుగురు విద్యార్థులను అరెస్టు చేశారు. ఫస్ట్ ఇయర్‌లో చేరిన విద్యార్థులు గత మూడు నెలలుగా సీనియర్ల వేధింపులకు గురవుతున్నట్లు సమాచారం. ఈ కేసులో సెకండ్ ఇయర్ నర్సింగ్ విద్యార్థులు సామ్యూల్ జాన్సన్, జీవా ఎన్ఎస్ అలాగే మూడో సంవత్సరం విద్యార్థులు రాహుల్ రాజ్, రిజిల్‌జిత్, వివేక్ ఎన్వీ ప్రధాన నిందితులుగా ఉన్నారు. ర్యాగింగ్ నిరోధక చట్టం ప్రకారం వీరిపై కేసు నమోదు చేయడంతో, కాలేజీ ప్రిన్సిపల్ వారిని తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. పోలీసుల ప్రకారం, ఫస్ట్ ఇయర్‌లో చదువుతున్న ముగ్గురు విద్యార్థులు సీనియర్లపై ఫిర్యాదు చేశారు.

వివరాలు 

మద్యం కొనడానికి సీనియర్లు జూనియర్ల నుంచి ₹800 వసూలు

సీనియర్లు తమ దుస్తులు విప్పించి, మర్మాంగాలపై డంబెల్స్ పెట్టేవారని బాధితులు తెలిపారు. అంతేకాకుండా, కొన్ని సందర్భాల్లో కంపాస్‌తో గుచ్చి గాయాలు చేసి, వాటిపై లోషన్ రాసేవారని చెప్పారు. ఈ ర్యాగింగ్ ఘటన ప్రధానంగా మెన్స్ హాస్టల్‌లో జరిగినట్లు పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా, మద్యం కొనడానికి సీనియర్లు జూనియర్ల నుంచి ₹800 డబ్బులు వసూలు చేసినట్లు తేలింది. వారు జూనియర్లను బలవంతంగా మద్యం తాగేలా చేసి, ఆ దృశ్యాలను వీడియో తీసి బెదిరించేవారని వివరించారు. కొన్ని రోజుల క్రితం డబ్బులు ఇవ్వలేదని ఓ జూనియర్ విద్యార్థిని సీనియర్ కొట్టాడు. ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పగా, వారి సూచన మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొట్టాయం ప్రభుత్వ మెడికల్ కాలేజీ పరిధిలో నర్సింగ్ కాలేజీ పనిచేస్తోంది.