E-visa services for Canada : రెండు నెలల తరువాత కెనడియన్లకు ఈ-వీసా సేవలను పునఃప్రారంభించిన భారత్
రెండు నెలల విరామం తర్వాత కెనడియన్లకు నిలిపివేసిన ఈ-వీసా(E-Visa Services) సేవలను పునఃప్రారంభించాలని భారత్ బుధవారం నిర్ణయించినట్లు తెలుస్తోంది. G20 దేశాధినేతల వర్చువల్ సమావేశానికి ముందు ఈ నిర్ణయం వెలువడింది. ఈ ఏడాది ప్రారంభంలో కెనడా గడ్డపై జరిగిన ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రమేయం ఉందన్న కెనడా ఆరోపించిన విషయం తెలిసిందే. అనంతరం ఈ ఏడాది సెప్టెంబరు 21 నుంచి కెనడియన్లకు వీసా (Visa) సర్వీసులను భారత్ నిలిపేసింది. అటు తరువాత భద్రతాపరమైన పరిస్థితులను సమీక్షించి అక్టోబర 26 నుంచి కెనడా పౌరులకు ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా కేటగిరీల్లో సేవలను పునరుద్ధరించింది.